పిన్నెల్లి సోదరులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

పిన్నెల్లి సోదరులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన

Jan 27 2026 7:48 AM | Updated on Jan 27 2026 7:48 AM

పిన్న

పిన్నెల్లి సోదరులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన

పిన్నెల్లి సోదరులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌కు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెనాలి ప్రఖ్య

కారెంపూడి: వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిల అక్రమ అరెస్టులను నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులు కారెంపూడిలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వైఎస్సార్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌ సీపీ నాయకులంతా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. వియ్‌ వాంట్‌ జస్టిస్‌, జగన్‌ నాయకత్వం వర్ధిల్లాలి, వియ్‌ స్టాండ్‌ విత్‌ పిన్నెల్లి బ్రదర్స్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర రైతు విభాగం అదనపు కార్యదర్శి కొమ్మిరెడ్డి నల్ల గురవారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిన అల్లయ్య, మండల యూత్‌ అధ్యక్షుడు చిలుకూరి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీటీసీ షేక్‌ షఫీ, వివిధ హోదాల నాయకులు షేక్‌ ఆరీఫ్‌, షేక్‌ మొహమ్మద్‌, కిల్లా రత్నకుమారి, జాన్‌పాల్‌ నాయక్‌, జిలానీ, మస్తాన్‌, యాసిన్‌ తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేట: ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ డివిజన్‌, సిటీ యూనిట్‌ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని అమరావతి, నూజెండ్ల తహసీల్దార్‌లు డేనియల్‌, జి.రమేష్‌కుమార్‌, డెప్యూటీ తహసీల్దార్‌ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గతంలో ముందుగా ఎటువంటి ప్రకటనలు, పబ్లికేషన్లు, ఓటరు జాబితా ప్రకటించకుండానే ఎన్నికలు నిర్వహించినట్లుగా సూచిస్తూ జిల్లా ఎన్నికలు వచ్చే పిభ్రవరి రెండో తేదీన నిర్వహిస్తామని ఏపీఆర్‌ఎస్‌ఎ పల్నాడు వాట్స్‌ప్‌ గ్రూపులో కొందరు పోస్టు చేశారన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఓటరు జాబితాలను పబ్లికేషన్‌ చేశామని పేర్కొన్నారన్నారు. కాని ఆ జాబితా ఆర్‌డీఓ కార్యాలయం, తహసీల్దార్‌, కలెక్టరేట్‌ ఆఫీసుల్లో పొందుపర్చలేదన్నారు. జిల్లా ఎన్నికల గురించి ఎటువంటి పత్రికా ప్రకటన ముందుస్తుగా ఇవ్వలేదన్నారు. గతంలో జరిగిన ఎన్నికలు సక్రమంగా జరగనందున ఆ ఎన్నికలు రద్దుచేసి మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఓటరు జాబితా ప్రకటించి బైలాస్‌ మేరకు ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు.

తెనాలి: గణతంత్ర వేడుకలలో భాగంగా ఢిల్లీలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి యువనర్తకి ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్యకు అరుదైన అవకాశం లభించింది. రిపబ్లిక్‌ పెరేడ్‌లో అన్ని రాష్ట్ర సంప్రదాయ నృత్యవిభాగంగా తెలుగురాష్ట్రాల నుండి పాల్గొన్నవారిలో తేజస్వి ప్రఖ్య ఒకరు వందేమాతరం గీతంకు చేసిన బృందనాట్యంలో పాల్గొన్నారు. దూరదర్శన్‌ ’బి’ గ్రేడ్‌తో పాటు కూచిపూడి నృత్యం ఎంఏ చేసిన ప్రఖ్య, ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటూ సెంట్రల్‌ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్‌ ఆచా ర్య పసుమర్తి రామలింగశాస్త్రి వద్ద కూచిపూడిలో ‘నట్టువాంగం‘లోననూ శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం పీహెచ్‌డీకి ఎన్‌ఈటీ, దూరదర్శన్‌ బీహై ఫలితాల కోసం ఎదురుచూస్తోంది.

పిన్నెల్లి సోదరులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన 1
1/1

పిన్నెల్లి సోదరులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement