నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లే ప్రభల ముందు ప్రమాదకర విన్యాసాలు చేసిన జేసీబీని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కాకాని నుంచి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభను ఈ నెల 14వ తేదీన కోటప్పకొండకు తరలించారు.
ఈ సందర్భంగా కోటప్పకొండ శివకుటుంబం జంక్షన్‌లో ప్రభ ఎదుట జేసీబీ చక్రాలను గాలిలోకి లేపి ప్రమాదకరంగా విన్యాసాలు నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. పెట్లూరివారిపాలెంకు చెందిన జేసీబీని బుధవారం స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌కు కౌన్సెలింగ్ చేశారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని రూరల్ ఎస్‌ఐ కిషోర్ తెలిపారు.


