అమరేశ్వర దర్శనం సర్వ పాప హరణం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను గురువారం ఆలయ కార్య నిర్వహణాధికారి రేఖ వివరించారు.
ఉత్సవాలలో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఉత్సవాల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామన్నారు. ఈనెల 15,17వ తేదీలలో నిర్వహించే శివరాత్రి ఉత్సవాలలో భక్తులు అమరావతి చేరుకోవటానికి ఆర్టీసీ వారు గుంటూరు, సత్తెనపల్లి, మంగళగిరి, విజయవాడల నుంచి సుమారు 60 బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారన్నారు.
ప్రధానంగా 15వ తేదీ కల్యాణోత్సవం, 17వ తేదీ స్వామి వారి దివ్య రథోత్సవం రోజులలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు రెండు వందల మంది పోలీసులతో బందోబస్తుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
దేవాలయంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితులలో ఉపయోగించేందుకు జనరేటర్‌ను సిద్ధం చేశామన్నారు.
స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు దేవాలయంలోకి వెళ్లేందుకు, అభిషేకానికి, ప్రత్యేక దర్శనానికి, ఉచిత దర్శనానికి వేర్వేరుగా క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు.
కృష్ణానది ఒడ్డున భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశామన్నారు. నదిలో స్నానం చేయటానికి నీరులేక పోవటంతో ప్రత్యేక షవర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
అలంకరణలో అమరేశ్వరుడు
విశేషాలంకారంలో ఉత్సవమూర్తులు
అమరావతి: సకల చరాచరా జగత్తుకు లయకారకుడైన ఈశ్వరుడు మాఘశుద్ధ చతుర్దశి నాడు లింగరూపంలో ఆవిర్భవించిన రోజున జరిపే మహాశివరాత్రి ఉత్సవాలను కలియుగ కై లాసమైన పంచారామ క్షేత్రాలలో ప్రథమారామ క్షేత్రం అమరావతిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తజన సులభుడిగా, భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలను చూసి తరించటానికి రాష్ట్ర వ్యాప్తంగా అశేషభక్త జనం అమరావతి రానున్నారు. నేటికీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులే అనువంశిక ధర్మకర్తలుగా స్వామివారి కై ంకర్యాలను నిర్వహిస్తున్నారు.
మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు
అమరేశ్వర దర్శనం సర్వ పాప హరణం


