శతాధిక వృద్ధురాలు మృతి
రొంపిచర్ల: పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన శతాధిక వృద్ధురాలు మారెళ్ళ నాగమ్మ (104) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు తోడబుట్టిన సోదరులు మృతి చెంది ఏళ్ళు గడుస్తున్నా వంద సంవత్సరాలకు పైగా ఆమె జీవించడం గొప్ప విషయమని గ్రామస్తులు అంటున్నారు. ఆరోగ్యం పట్ల ఆమె తీసుకున్న జాగ్రత్తలు, ఈ వయస్సులో కూడా ఆమె వ్యక్తిగత పనులు చేసుకోవడం వల్ల ఇన్నాళ్లు జీవించారని అనుకుంటున్నారు. మృతురాలికి కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లు ఆమె సోదరుల కుమారులు, కుమార్తెలు కలిసి 100 మందికి పైగా ఉంటారు.


