మిర్చి యార్డు చైర్మన్‌గా అప్పారావు బాధ్యతల స్వీకరణ
మిర్చి యార్డు చైర్మన్‌గా అప్పారావు బాధ్యతల స్వీకరణ కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్‌గా కుర్రా అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే యార్డు వైస్ చైర్మన్‌గా బిట్రగుంట మల్లిక, పాలకవర్గ సభ్యులుగా నక్కల వంశీకృష్ణ, కేవీ సత్యనారాయణ, ఎం.మంగ భాయ్, కె.విజయలక్ష్మి, మొహమ్మద్ హఫీజ్, ఎం.సైదయ్య, షేక్ ఖాదర్ భాయ్, బి.జాన్ సైదా, డి.విజయమ్మ, చంద్రగిరి బాబు, ఐ.వెంకటలక్ష్మి, డి.భాగ్యారావు, కె.శ్రావణ కుమారిలు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర(నాని), వ్యవసాయ మార్కెట్ కమిటీ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక, పలువురు అధికారులు, పార్టీ నాయకులు కుర్రా అప్పారావును కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తుల్జా భవానీ మునేశ్వరస్వామి ఆలయం ధ్వంసం అచ్చంపేట: అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామ సమీపంలోని అడవిలో 14వ శతాబ్దంలో నిర్మించిన తుల్జా భవానీ మునేశ్వర స్వామి వారి దేవాలయంపై మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆనవాళ్లను తొలగించడం సంచలనంగా మారింది. ఈ సంఘటనను అఖిల భారతీయ గిరిజన వికాస్ పరిషత్ సంఘం ఉపాధ్యక్షుడు వాంకడోత్ శ్రీనివాస్ నాయక్, కార్యవర్గ సభ్యులు బాణవతు మురళి నాయక్, మూడవతు శివ నాయక్, గూగులోతు సీతారాం నాయక్ లు ఖండించారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన తుల్జా భవానీ అమ్మవారిని అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లోని గిరిజన తండాలకు సంబంధించి గిరిజనులు ఎక్కువగా పూజిస్తారన్నారు. చుట్టుపక్క గ్రామాల ప్రజలు పూజలు చేస్తుంటారని తెలిపారు. అలాంటి దేవాలయం గుర్తులను ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేసిన దుండగులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
23న ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల
గోళ్ళపాడు (ముప్పాళ్ల): గోళ్లపాడు గ్రామంలో వేంచేసియున్న ప్రసన్నాంజనేయస్వామి 34వ జయంతి తిరునాళ్ల ఈ నెల 23వ తేదీన జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు. తిరునాళ్ళలో భాగంగా 21వ తేదీ తెల్లవారుజాము నుంచి ఆలయంలో హరే రామ నామ సంకీర్తన ఏకాహం, ప్రసన్నాంజనేయ స్వామి వారి గ్రామోత్సవం, 22న స్వామి వారికి సకల నదీజల పంచామృత స్నపన, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం లక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. 23న హనుమద్దీక్ష విరమణ, సామూహిక ఆకు పూజలు, పొంగళ్ళు సమర్పణ, సాయంత్రం హనుమత్‌జ్యోతి దర్శనం, తిరునాళ్ల జరుగుతుందన్నారు.
1/2
మిర్చి యార్డు చైర్మన్‌గా అప్పారావు బాధ్యతల స్వీకరణ
2/2
మిర్చి యార్డు చైర్మన్‌గా అప్పారావు బాధ్యతల స్వీకరణ