తొలిసారిగా నృసింహస్వామి రథోత్సవం రద్దు
మంగళగిరి టౌన్: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన మంగళగిరిలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి మార్చి 5వ తేదీ వరకు నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 1వ తేదీన పొన్నవాహనం, 2వ తేదీ కల్యాణ మహోత్సవం జరగనుంది. 3వ తేదీన జరిగే రథోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవో సునీల్‌కుమార్ మాట్లాడుతూ మూడవ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి రథోత్సవాన్ని ప్రారంభించాల్సి ఉండగా చంద్ర గ్రహణం కారణంగా ఆగమ శాస్త్ర పెద్దలు నిర్ణయించిన మేరకు, వారి సూచనల మేరకు రద్దు చేస్తున్నామని, భక్తుల కోసం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు స్వామివారిని రథంపై నుంచే దర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఎప్పటిలాగే రథాన్ని అలంకరించి శాస్త్రోక్తంగా స్వామివారిని అధిష్టింపచేస్తామని పేర్కొన్నారు.


