శివరాత్రి పర్వదినాన కోటప్పకొండకు సమీపంగా ఉండే రొంపిచర్ల గ్రామంలో టీడీపీ నాయకులు భారీ ఎత్తున కోడి పందేలు, జూదశిబిరాలు ఏర్పాటు చేశారు. కొండకు వచ్చే వారిని ఆకర్షించేలా జూదాలు కొనసాగించారు. పందెంరాయుళ్లు కొండ కంటే ముందుగా రొంపిచర్ల వైపు కదలడం గమనార్హం. ఎన్నడూలేని విధంగా కోటప్పకొండ పవిత్రతను దెబ్బతీస్తూ ఇలా నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు.
సాధారణంగా ఒకరిద్దరు పేకాట ఆడుతుంటేనే పోలీసులు పట్టుకుంటారు. అలాంటిది వందల మంది బహిరంగంగా ఇలా పేకాకుతున్నా, దీనిపై సమాచారం ఉన్నా పోలీసులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పండుగ ముగిసి నాలుగు రోజులైనా బరుల నిర్వహకులను అరెస్ట్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిపై చర్యలు వంటివేమీ ఉన్నతాధికారులు కూడా చేపట్టలేదు.


