తిరునాళ్లలో ఏరులై పారిన మద్యం
కోటప్పకొండ వద్ద భారీగా మద్యం, మాంసాహార భోజన విక్రయాలు మద్యం విక్రయించిన పోలీసు హోంగార్డు మూడు వేల మంది సిబ్బంది, 30 డ్రోన్లకు కనిపించలేదా అంటూ విమర్శలు బెల్టు షాపులు పెట్టినా పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
సాక్షి, నరసరావుపేట: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో ఓ వైపు శివనామస్మరణ వినిపిస్తుండగా మరోవైపు మద్యం, మాంసాహార విక్రయాలు యథేచ్ఛగా కొనసాగాయి. శివరాత్రి సందర్భంగా ఏటా మూడు రోజులపాటు కోటప్పకొండ పరిసరాలలో మద్యం అమ్మకాలను జిల్లా కలెక్టర్ నిషేధిస్తారు. ఈ ఏడాది నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడం మరిచారు. కొండ పరిసర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో బెల్టుషాపులు ఏర్పాటు చేసి జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. వీటిని అడ్డుకోవాల్సిన ఎకై ్సజ్, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చూసీచూడనట్టు వదిలేశారు. బెల్టుషాపులు నిర్వహిస్తున్నది అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు కావడంతో మిన్నుకుండిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియాకి చెందిన పలువురు కోటప్పకొండ వద్ద జరుగుతున్న అపచారాన్ని వీడియోల రూపంలో తీసి ఎండగట్టడంతో విషయం బహిర్గతమైంది. అత్యంత ప్రసిద్ధిగాంచిన త్రికోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మద్యం అమ్మకాలు, మాంసాహార విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం తాగి సోయలేకుండా పడిపోయిన దృశ్యాలు కలవరపరిచాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధులకు డుమ్మా కొట్టి... మద్యం అమ్ముతూ
లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో కోటప్పకొండ పరిసరాలలో పోలీసు సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైంది. కొండ పరిసరాలలో అసాంఘిక కార్యక్రమాలు అడ్డుకోవాల్సిన ఓ పోలీసు హోంగార్డు ఆదివారం మద్యం బెల్టుషాపు ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం విక్రయించారు. నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ వద్ద సన్నిహితంగా ఉండే హోంగార్డు కోటేశ్వరరావుకు ఆదివారం కొండ పరిసరాలలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ట్రాఫిక్ సూచికల ఏర్పాటు డ్యూటీ వేశారు. వాటికి డుమ్మా కొట్టిన అతను తన బెల్టుషాపులో అక్రమంగా మద్యం విక్రయిస్తూ కనిపించా డు. ఈ ఘటనతో పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ ఇలాంటి అపచారం చేయడమేంటని మండిపడుతున్నారు. మరోవైపు మూడు వేలమంది సిబ్బంది, 30 డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పుకున్న పోలీసు ఉన్నతాధికారులకు సొంత సిబ్బంది బెల్టుషాపు నిర్వహిస్తున్న విషయం తెలియలేదా.. తెలిసినా మిన్నుకుండిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి పోలీసులు అలసత్వం వహించడం వల్ల ఎక్కడికక్క డ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం కూడా వీటన్నింటికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తిరునాళ్లలో ఏరులై పారిన మద్యం


