వైభవంగా లింగోద్భవ అభిషేకాలు
నర సరావుపేటరూరల్: మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి వారికి లింగోద్భవ పూజలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి 12గంటల నుంచి ప్రారంభమైన పూజలు సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగా యి. పంచామృత ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావు, దేవదాయ శాఖ డిప్యూటి కమిషనర్ చంద్రకుమార్‌లు అభిషేకాల్లో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో లింగోద్భవ పూజలను తిలకించారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
వైభవంగా లింగోద్భవ అభిషేకాలు


