ఇంజనీరింగ్‌ విద్యార్థి అవయవదానం | - | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థి అవయవదానం

Feb 12 2026 7:33 AM | Updated on Feb 12 2026 7:33 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థి అవయవదానం

ఇంజనీరింగ్‌ విద్యార్థి అవయవదానం

● శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల పీఏసీఎస్‌ ఉద్యోగులతో కలిసి సహకార శాఖ కమిషనర్‌, రిజిస్ట్రార్‌ కార్యాలయాల ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఈ నెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.

తాడేపల్లిరూరల్‌: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన విజయ్‌కుమార్‌ (20) తాడేపల్లిలోని ఓ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం విజయ్‌కుమార్‌కు బ్రెయిన్‌ డెడ్‌గా బుధవారం వైద్యులు నిర్ధారించారు. విజయ్‌కుమార్‌ తండ్రి సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు విజయ్‌కుమార్‌ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ జీవన్‌దాన్‌ చైర్మన్‌ డా. కె. రాంబాబు, హాస్పిటల్‌ డైరెక్టర్‌ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం చేశారు. గుండె, కాలేయం మణిపాల్‌ హాస్పిటల్‌లో అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయగా, ఊపిరితిత్తులను హైదరాబాద్‌ కిమ్స్‌కు, కిడ్నీలకు విధాత హాస్పిటల్‌కు, కంటి కార్నియాను విజయవాడ ఎల్‌వి ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. విజయ్‌కుమార్‌ అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు మణిపాల్‌ హాస్పిటల్‌ వర్గాలు కృతజ్ఞతలు తెలిపారు.

కూరగాయలు విక్రయిస్తూ

పీఏసీఎస్‌ ఉద్యోగుల నిరసన

కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శ్యామలానగర్‌లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కూరగాయలు విక్రయిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణమే సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన పీఏసీఎస్‌ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

– ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వెలుగూరి రాధాకృష్ణ మాట్లాడుతూ గత రెండు నెలలుగా పీఏసీఎస్‌ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement