వివక్ష లేకపోవడమే సామాజిక న్యాయం | - | Sakshi
Sakshi News home page

వివక్ష లేకపోవడమే సామాజిక న్యాయం

Feb 21 2026 7:32 AM | Updated on Feb 21 2026 7:32 AM

వివక్ష లేకపోవడమే సామాజిక న్యాయం

వివక్ష లేకపోవడమే సామాజిక న్యాయం

గుంటూరు లీగల్‌: కుల, మత, లింగ, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మహిళలు, అణగారిన వర్గా లు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి ఒక్కరికీ సమానమైన గౌరవం దక్కడం, ఏ రంగంలోనైనా వివక్ష లేకుండా సమాన హక్కులను కలిగి ఉండడమే సామాజిక న్యాయం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ పేర్కొన్నా రు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంపై న్యాయ విజ్ఞాన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు అందే న్యాయపరమైన హక్కుల గురించి వివరించారు. లోక్‌ అదాలత్‌ ద్వారా దీర్ఘకాలంగా ఉన్న న్యాయపరమైన సమస్యలను రాజీ దిశగా పరిష్కారం కోసం కృషి చేయడం, అవగాహనా సదస్సుల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపరంగా జరిగే న్యాయాల గురించి తెలియజేస్తామన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అమలులో ఉన్న పలు పథకాల గురించి వి వరించారు. అట్టడుగు వర్గాల సాధికారతపై అవగాహన కల్పించారు. అర్హులకు అవసరమైన కుల, ని వాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌, ఆధార్‌ కార్డు అందించడంలో సహకరించాలని తెలిపారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement