కోటప్పకొండ ఆలయానికి రూ.10 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

కోటప్పకొండ ఆలయానికి రూ.10 లక్షల విరాళం

Feb 16 2026 7:33 AM | Updated on Feb 16 2026 7:33 AM

కోటప్

కోటప్పకొండ ఆలయానికి రూ.10 లక్షల విరాళం

కోటప్పకొండ ఆలయానికి రూ.10 లక్షల విరాళం షూటింగ్‌ బాల్‌ చాంపియన్లు నెల్లూరు, చిత్తూరు ● బాలికల విభాగంలో ప్రథమ స్థానం చిత్తూరు జిల్లా సాధించగా ద్వితీయ స్థానం అనంతపురం, తృతీయస్థానం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జట్లు సాధించాయి. విజేతలకు టోర్నమెంట్‌ పరీశీలకుడు, పల్నాడు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పి.నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం జేశారు. కార్యక్రమంలో న్యాయవాది పిన్నమ నేని పాములయ్య, లగడపాటి గజానన, గద్దె అప్పారావు పీడీలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. కాల్వలో స్నానానికి దిగి యువకుడు మృతి ద్విచక్ర వాహనాలు ఢీ: యువకుడు మృతి

మంత్రి గొట్టిపాటి, కలెక్టర్‌కు చెక్కు అందజేసిన క్వారీ అసోసియేషన్‌ యజమానులు

నరసరావుపేట: కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లకు వచ్చే భక్తుల వసతుల కల్పనకోసం సంతమాగులూరు మండలం గురిజేపల్లికి చెందిన శ్రీ త్రికోటేశ్వర గ్రానైట్‌ క్వారీ అసోసియేషన్‌ రూ.10లక్షల విరాళాన్ని అందజేసింది. ఆదివారం అసోసియేషన్‌ ప్రతినిధులు ఈ మేరకు చెక్కును రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమక్షంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లాకు అందజేశారు. దాతలను ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్‌ అభినందించారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం క్వారీ అసోసియేషన్‌ వారు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు.

సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్‌ అంతర జిల్లాల షూటింగ్‌ బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల జట్లు సత్తా చాటి చాంపియన్‌గా నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న 9వ సబ్‌ జూనియర్‌ ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల షూటింగ్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని 18 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు హజరయ్యాయి. బాల,బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాల, బాలికలు నువ్వా.. నేనా అన్నట్లు క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో బాలుర విభాగంలో ప్రథమ స్థానం నెల్లూరు జిల్లా సాధించగా ద్వితీయ స్థానం పల్నాడు జిల్లా, తృతీయస్థానం ఎన్టీఆర్‌ జిల్లా జట్లు కై వసం చేసుకున్నాయి.

నరసరావుపేట టౌన్‌: ఎన్‌ఎస్పీ మేజర్‌ కెనాల్‌లో స్నానానికి దిగి యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం పెట్లూరివారిపాలెం వద్ద చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఓలేటివారిపాలెం మండలం సింగ్నేనిపల్లి గ్రామానికి చెందిన కట్టా రోహిత్‌(20) హైదరాబాద్‌లో బేల్‌దార్‌ పని చేస్తుంటాడు. కోటప్పకొండ తిరునాళ్ల చూసేందుకు శనివారం రాత్రి ఐదుగురు స్నేహితులతో కలిసి కారులో వచ్చాడు. పెట్లూరివారిపాలెం గ్రామం వద్ద ఏఎంరెడ్డి కళాశాల సమీపంలో ఎన్‌ఎస్పీ కాల్వలో స్నానం చేసేందుకు తెల్లవారుజామున దిగాడు. ఈత రాకపోవటంతో కాల్వలో నీటమునిగాడు. గమనించిన స్నేహితులు అభి, ఎలీషా, శ్రీనాథ్‌, ఇసాక్‌, మల్లిఖార్జునలు బయటకు తీసి కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్‌ఐ కిషోర్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ముగ్గురికి గాయాలు

నూజండ్ల: మండల పరిధిలోని పాత, కొత్త ఉప్పలపాడు గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో ములకలూరు గ్రామానికి చెందిన మందా శాంసన్‌ (28) సంఘటనా స్థలంలో మృతిచెందగా క్షతగ్రాత్రులను 108 ద్వారా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన ధనుంజయ్‌ ఈదర మీదుగా బైక్‌పై వినుకొండకు వస్తూ.. మార్గమధ్యంలో వేరే మహిళను ఎక్కించుకుని వస్తున్నాడు. అదే సమయంలో ములకలూరు గ్రామానికి చెందిన శాంసన్‌ తన మిత్రుడితో కలిసి బైక్‌పై వినుకొండ నుంచి వస్తుండగా ఉప్పలపాడు గ్రామ సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఽఢీ కొన్నాయి. ప్రమాదంలో శాంసన్‌ మృతి చెందగా మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుడు మందా శాంసన్‌కు భార్య నాగమల్లేశ్వరి, ముగ్గురు సంతానం ఉన్నారు. పండుగ రోజు కుటుంబ పెద్ద మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

కోటప్పకొండ ఆలయానికి రూ.10 లక్షల విరాళం  1
1/1

కోటప్పకొండ ఆలయానికి రూ.10 లక్షల విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement