పెట్లూరు వారిపాలెంలో భారీగా ట్రాఫిక్ జామ్...
నరసరావుపేట మండలం పెట్లూరు వారిపాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో నరసరావుపేట నుంచి కోటప్పకొండకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు వాహనాలు భారీస్థాయిలో నిలిచిపోయాయి. బస్సులోని ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. పెట్లూరు వారిపాలెం గ్రామానికి చెందిన రెండు ప్రభలు ఉదయం 11 గంటల సమయంలో కొండకు బయలుదేరాయి. ఆ సమయంలో గుంటూరు–కర్నూలు హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు విమర్శించారు.


