పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి...
రాష్ట్ర పండుగ హోదాలో కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి వారికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం ఉదయం 10.30 గంటలకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అధికారులు, పూజారులు మంత్రికి స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెలే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబుతో కలసి ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి, కలెక్టర్ కృతికాశుక్లా, ఎస్పీ కృష్ణారావు, ఆలయ ఈవో చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.


