పల్నాడు
పూర్తిగా చతికిలపడిన సత్తెనపల్లి భారీగా పేరుకుపోతున్న బకాయిలు బడాబాబుల జోలికి వెళ్లని అధికారులు
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాగునీటిపై ఆందోళన వద్దు
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7000, గరిష్ట ధర రూ.8300, మోడల్ ధర రూ.7500 వరకు పలికింది.
కొల్లూరు : ముస్లింలు రంజాన్ ఉపవాస
దీక్షలను నియమ, నిష్టలతో ఆరంభించారు. మసీదులను గురువారం విద్యుత్ దీపాలతో అలంకరించారు.
జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లలో సత్తెనపల్లి మున్సిపాలిటీ అధికారులు చతికిలపడ్డారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి సుదూరంగా నిలిచారు. మరో 40 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో లక్ష్య సాధన ప్రశ్నార్థకంగా మారింది.
సత్తెనపల్లి: మున్సిపాలిటీల పరిధిలో పన్నుల వసూళ్లు కీలకంగా మారాయి. ఆస్తి, నీటి పన్నులతో పాటు ట్రేడ్ లైసెనన్సు ఫీజుల వసూళ్లు సక్రమంగా సాగాలి. అయితే సత్తెనపల్లి మున్సిపాలిటీలో ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఈ దుస్థితి నెలకొనడం గమనార్హం.
పేరుకుపోయిన బకాయిలు
2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలో కేవలం 17.54 శాతం మాత్రమే ఆస్తి పన్ను వసూలైంది. అత్యధికంగా దాచేపల్లి మున్సిపాలిటీ 41.40 శాతం వసూళ్లు చేపట్టగా .. అత్యల్పంగా చిలకలూరిపేట 10.80 శాతంతో చతికిలబడింది. జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలో 1,35,846 అసెస్‌మెంట్లు ఉన్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 5,161.52 లక్షలు డిమాండ్ ఉంది. దీనికి తోడు ఎరియర్స్ రూ. 1,380.26 లక్షలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు కరెంటు డిమాండ్‌లో రూ.3,151.23 లక్షలు, ఎరియర్స్‌లో రూ. 295.89 లక్షలు వెరసి రూ. 3,447.12 లక్షలు వసూలు అయ్యాయి.
ప్రభుత్వ శాఖలపై ఉదాసీనత...
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పన్నుల బకాయలు పేరుకుపోయాయి. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే సామాన్యుల ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. కేవలం నోటీసులు ఇచ్చి పన్ను వసూళ్లను గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి.
టాప్ టెన్‌లో బడాబాబులు ...
జిల్లాలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్న వారు మున్సిపాలిటీలకు సకాలంలో పన్నులు చెల్లించకుండా మొండికేస్తున్నట్లుగా తెలుస్తోంది. బకాయిల టాప్ టెన్ జాబితాలో బడా బాబులే ఉండడం ఇందుకు నిదర్శనం. వారిపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఒకవేళ చర్యలకు శ్రీకారం చుట్టినా టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీవ్రమవుతాయనే భయం అధికారులను వెన్నాడుతోంది. వీటికి తోడు డోర్ లాక్ట్ ఇళ్లు అధికంగా ఉండడం కూడా సమస్యగా మారింది.
9
జిల్లాలో వసూలు కావాల్సిన ఆస్తి పన్ను
(పాత బకాయిలతో కలిపి..)
అసెస్‌మెంట్లు డిమాండ్ వసూలు
(రూ.లక్షల్లో) శాతం
నరసరావుపేట 28,539 1,853.89 26.80
మాచర్ల 15,395 734.93 26.20
చిలకలూరిపేట 25,431 1,247.56 10.80
సత్తెనపల్లి 16,546 834.70 22.30
పిడుగురాళ్ల 15,899 759.53 18.80
దాచేపల్లి 10,691 292.83 41.40
గురజాల 8,132 168.16 26.60
వినుకొండ 15,213 650.18 22.40
నరసరావుపేట రూరల్: పంట పొలాలకు ఈనెల 25వ తేదీ వరకు నీటి సరఫరా ఉంటుందని ఎన్‌ఎస్‌పీ డీఈ ఎం.ఉమాశంకర్ తెలిపారు. పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు, ఏడీఏ కేవీ శ్రీనివాసరావుతో కలిసి గురువారం కేఎం అగ్రహారంలో పర్యటించారు. మొక్కజొన్న చేలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నీటి కోసం ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. పంటలకు సరిపడా నీటి సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొక్కజొన్న కండె దశలో ఉన్నందున అంతరాయం లేకుండా నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


