పచ్చ నేతల పైసాచికం ! | - | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల పైసాచికం !

Feb 19 2026 9:57 AM | Updated on Feb 19 2026 9:57 AM

పచ్చ

పచ్చ నేతల పైసాచికం !

గురువారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 పచ్చ నేతల పైసాచికం ! వరదలా పారిన మద్యం

గురువారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

ఒక వైపు డమరుక నాదాలు మార్మోగుతుంటే.. మరో వైపు టీడీపీ నేతలు కత్తి కట్టిన కోళ్లతో పందెం బరిలో రక్తం చిందించేలా చేశారు. ఒక వైపు ‘‘హర హర మహాదేవ’’ అంటూ భక్తులు నినదిస్తుంటే... మరో వైపు టీడీపీ నాయకులు అక్రమంగా మద్యం తెచ్చి సీసాలు గలగలమనిపించారు. ఒక వైపు భక్తులు కొండకు దారులు కడితే.. ఇంకోవైపు టీడీపీ నేతలు జూద శిబిరాలకు పేకాటరాయుళ్లను బారులుదీరేలా ఏర్పాట్లు చేశారు. భక్త కోటి తరలివచ్చి త్రికోటేశ్వరుని దర్శించుకునే వేళ చంద్రబాబు పాలనలో టీడీపీ నాయకుల కారణంగా కోటప్పకొండ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఎన్నడూ లేని విధంగా కొండను అపవిత్రం చేస్తూ నాయకులు జేబులు నింపుకొన్నారు.

నరసరావుపేట టౌన్‌: శివరాత్రి అంటే ఉపవాసం, జాగారం, శివనామస్మరణ. భక్తి, నియమం, నియంత్రణల సమ్మేళనం. ముఖ్యంగా కోటప్పకొండ వంటి పుణ్యక్షేత్రంలో శివరాత్రి వేళ భక్తి పారవశ్యం తారస్థాయికి చేరుకుంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభలు కట్టుకుని ఎంతో భక్తితో శివయ్య పాదాల చెంతకు భక్తులు చేరుకుంటారు. కానీ అడుగడుగునా టీడీపీ నాయకులు ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని అపవిత్రం చేశారు. భక్తజన సమూహాల మధ్య అసాంఘిక కార్యకలాపాలు బహిరంగంగా కొనసాగించారు. మహా శివరాత్రి పర్వదినాన కోటప్పకొండకు సుమారు పది లక్షల మందికిపైగా భక్తులు వస్తుంటారు. ఏటా ఒకటికి మించి మరొకటి భారీ విద్యుత్‌ ప్రభలు తరలివస్తాయి. భక్తులు కూడా తిరునాళ్ల వాతావరణాన్ని ఆస్వాదిస్తారు.

ఆధ్యాత్మిక వాతావరణానికి భిన్నంగా ఈ ఏడాది టీడీపీ నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు తెరతీశారు. తిరునాళ్ల నిర్వహించే కొండ కింద ప్రాంతంలో పదుల సంఖ్యలో బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. నరసరావుపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కోటేశ్వరరావు స్వయంగా బెల్టుషాపు నిర్వహిస్తూ మద్యం విక్రయించడం గమనార్హం. దీంతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు కూడా బెల్టుషాపుల నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకొని అక్రమంగా మద్యం విక్రయాలకు తెరతీశారు. అక్కడ మద్యం అమ్మకాలను నిషేధిస్తూ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కారు. అతిగా మద్యం సేవించిన వారితో కొందరు భక్తులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఇన్నేళ్ల కొండ తిరునాళ్ల చరిత్రలో ఈ స్థాయిలో బహిరంగంగా మద్యం అమ్మకాలు చేసిన ఘటనలు లేవు. తిరునాళ్ల రోజు కొండ ప్రభలు ఏర్పాటు చేసే పరిసరాలలో బెల్టుషాపులు నిర్వహించేందుకు వేలం నిర్వహించినట్టు తెలుస్తోంది. టీడీపీ నాయకులకు డబ్బులు ముట్టచెప్పి బహిరంగంగా బెల్టుషాపులు నిర్వహించడం చంద్రబాబు మార్కు పాలనకు ఉదహరణగా నిలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నలలో బెల్టుషాపులు వెలవడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఈ పరిణామాల పట్ల హిందుత్వవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఈ సంస్కృతి పునరావృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

శివరాత్రి పర్వదినాన టీడీపీ

నాయకుల ఇష్టారాజ్యం

తిరునాళ్లలో బెల్టు షాపులతో

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

రొంపిచర్లలో కోడి పందేలు,

పేకాట శిబిరాలు ఏర్పాటు

ఎక్కడా కనీసం అడ్డు కూడా

చెప్పని అధికార యంత్రాంగం

టీడీపీ నేతల ధనదాహంపై

మండిపడుతున్న భక్తులు

పచ్చ నేతల పైసాచికం ! 1
1/3

పచ్చ నేతల పైసాచికం !

పచ్చ నేతల పైసాచికం ! 2
2/3

పచ్చ నేతల పైసాచికం !

పచ్చ నేతల పైసాచికం ! 3
3/3

పచ్చ నేతల పైసాచికం !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement