● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ● 15న కోటప్పకొండ తిరునాళ్ల ● అధ్వాన్నంగా రోడ్లు | - | Sakshi
Sakshi News home page

● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ● 15న కోటప్పకొండ తిరునాళ్ల ● అధ్వాన్నంగా రోడ్లు

Feb 10 2026 7:42 AM | Updated on Feb 10 2026 7:42 AM

● మిగ

● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ●

● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ● 15న కోటప్పకొండ తిరునాళ్ల ● అధ్వాన్నంగా రోడ్లు

ఆలయంలో ఏర్పాట్లు

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై మూడుసార్లు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం సమీక్షలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరునాళ్లకు మరో మూడు రోజులే సమయం ఉన్నా పనుల్లో వేగం కనిపించడం లేదు.

రహదారుల పరిస్థితి ఆధ్వానం ...

కోటప్పకొండకు చేరుకునే ప్రధాన రహదారుల మినహా మిగిలిన రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చిలకలూరిపేట మేజర్‌ కెనాల్‌ రోడ్డు పెద్ద పెద్ద గోతులతో నిండిపోయింది. ప్రభలు కొండకు చేరుకునే సమయంలో అర్ధరాత్రి ఈ మేజర్‌ కెనాల్‌ వద్ద ట్రాఫిక్‌ నిలిచిపోతుంటుంది. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు ఈ రోడ్డును వినియోగిస్తారు. అలాగే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే కొండకావూరు రోడ్డులో కూడా మరమ్మతు పనులు చేపట్టలేదు. యూటీ నుంచి క్రషర్స్‌ మీదుగా ట్రాఫిక్‌ మళ్లిస్తారు. ఈ రోడ్దు దుమ్ముతో నిండిపోయి ఉంది. చినతురకపాలెం నుంచి గొనెపూడి, గురవాయపాలెం నుంచి గొనెపూడి రోడ్లు మరమ్మతు పనులు ప్రారంభించలేదు.

వడివడిగా పనులు

జాతర జరిగే కొండ దిగువున ప్రధాన రోడ్లులో విద్యుత్‌ దీపాలు ఏర్పాట్లు పనులను ఆర్‌అండ్‌బీ ఎలక్ట్రీకల్‌ విభాగం ప్రారంభించింది. ప్రధాన రోడ్డులో ఐరెన్‌ పోల్స్‌కు విద్యుత్‌ దీపాలు బిగించే పనులు నిర్వహిస్తున్నారు. బారికేడింగ్‌ పనులు ప్రారంభించలేదు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా నూతన ట్రాన్స్‌ ఫార్మర్స్‌ను ఏర్పాటు చేసే పని విద్యుత్‌ శాఖ చేపట్టింది. మేజర్‌ కెనాల్‌ వద్ద భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లు పనులు ప్రారంభం కాలేదు.

క్యూలైన్‌ వద్ద చలువ పందిళ్లు

ప్రధాన ఆలయ గాలిగోపురానికి నూతనంగా రంగులు వేసే పని పూర్తిచేశారు. విద్యుత్‌ దీపాలతో ఆలయాన్ని అలంకరించే పనులు చేపట్టారు. భక్తులకు ఎండ వేడిమి లేకుండా క్యూలైన్‌ ప్రారంభంలో చలువ పందిళ్ళు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. లడ్డూ, అరిసే ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్‌లో మరమ్మతులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.

● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ●1
1/2

● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ●

● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ●2
2/2

● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement