అర్జీలు నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలి

Feb 10 2026 7:42 AM | Updated on Feb 10 2026 7:42 AM

అర్జీలు నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలి

అర్జీలు నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలి

● జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ● 105 అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌, జేసీ, జిల్లా అధికారులు

నరసరావుపేట: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ, జిల్లా అధికారులతో కలిసి 105 అర్జీలు స్వీకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్‌ శిబిరం ద్వారా మూడు డివిజన్లకు చెందిన ఆర్‌డీఓలు అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్‌ ద్వారా గురజాల డివిజన్‌ నుంచి తొమ్మిది, సత్తెనపల్లి ఎనిమిది, నరసరావుపేట నుంచి 20 అర్జీలు స్వీకరించారు. అర్జీలు నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అర్జీలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement