సబ్ రిజిస్ట్రార్ అశోక్‌కుమార్‌కు జిల్లా రిజిస్ట్రార్
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న బి. అశోక్ కుమార్‌కు జిల్లా రిజిస్ట్రార్‌గా పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది సబ్ రిజిస్ట్రార్‌లకు జిల్లా రిజిస్ట్రార్‌లుగా పదోన్నతి లభించింది. ఈ క్రమంలో అశోక్ కుమార్‌కు జిల్లా రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పించి నంద్యాల జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2024 సెప్టెంబర్‌లో ఆయన గురజాల నుంచి సత్తెనపల్లి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. గురువారం విధుల నుంచి రిలీవై నంద్యాల జిల్లా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. పదోన్నతి పొందిన అశోక్ కుమార్ ను కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.


