సహకార సమ్మెను ఉధృతం చేస్తాం
రొంపిచర్ల: సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంస్థ ఉద్యోగుల యూనియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాలుగవ రోజుకు చేరింది. రెండు నెలలుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఈనెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లిపోయారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 60 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. శుక్రవారం నరసరావుపేట జీడీసీసీ బ్యాంక్ బ్రాంచ్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు పలు ట్రేడ్ యూనియన్‌లు, ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు. జీవో నెం.36ను అమలు చేయాలని డిమాండ్‌చేస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్ర చేస్తామని హెచ్చరించారు. ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా వెనుకాడబోమన్నారు. నరసరావుపేట జీడీసీసీ బ్యాంక్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో సీఈవోలు కంటు శ్రీనివాసరావు, దొప్పలపూడి శ్రీనివాసరావు, రామాంజనేయులు, రహీం, రమేష్, తోట రాంబాబు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
జీడీసీసీ బ్యాంక్ బ్రాంచ్ వద్ద
ఉద్యోగులు ఆందోళన


