సత్తెనపల్లిలో రూ.3.50 కోట్లతో నిర్మాణం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్జీవోస్ సెంటర్‌లో రూ. 3.50 కోట్లతో అన్ని హంగులతో కూడిన బిలాల్ మసీద్‌ను(చిన్న మసీద్) ఆదివారం ఢిల్లీకి చెందిన ప్రముఖ మత గురువు ప్రారంభించి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక నమాజు నిర్వహించారు. సత్తెనపల్లిలో 110 సంవత్సరాల క్రితం ఢిల్లీ నిజాముద్దీన్‌కి అనుసంధానంగా పవిత్రమైన బిలాల్ మసీద్ (చిన్నమసీద్) నిర్మాణం జరిగింది. ఆ మసీద్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల దానిని కూల్చివేసి నూతన మసీదు నిర్మాణం కోసం ముస్లీం సోదరులు శ్రీకారం చుట్టి విరాళాలు సేకరించారు.
లగడపాడు గ్రామంలో...
పెదకూరపాడు: మండలంలోని లగడపాడు గ్రామంలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో రూ. కోటితో నూతనంగా నిర్మించిన మస్జీదే మహమ్మదీయను ఉమ్మడి గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దలు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక నమాజు నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ చేపట్టారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు.
మార్టూరు: పిల్లల మధ్య ప్రారంభమైన వివాదం పెద్దల మధ్య ఘర్షణకు దారి తీసిన ఘటన మండలంలోని నాగరాజు పల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. అందిన వివరాల మేరకు.. నాగరాజుపల్లి గ్రామం వెలుపల గల భూముల్లో స్థానిక పిల్లలు కర్రాబిళ్ల ఆట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వివాదం ప్రారంభమై క్రమేపి వారి పెద్దల వరకు వెళ్లింది. క్షణికా వేశానికి లోనైన ఇరుపక్షాలకు చెందిన పెద్దలు గ్రామంలోని రోడ్లపై పరస్పరం దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు వర్గాలకు చెందిన ముఖ్యులను స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇరు వర్గాలకు చెందిన సుమారు 50 మందికి పైగా నాగరాజు పల్లి గ్రామస్తులు స్టేషన్ పరిసరాల్లో గుమిగూడటం చర్చనీయంశమైంది.
సత్తెనపల్లిలో రూ.3.50 కోట్లతో నిర్మాణం


