పెళ్లి కుమారుడైన అమరేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

పెళ్లి కుమారుడైన అమరేశ్వరుడు

Feb 15 2026 7:32 AM | Updated on Feb 15 2026 7:32 AM

పెళ్లి కుమారుడైన అమరేశ్వరుడు

పెళ్లి కుమారుడైన అమరేశ్వరుడు

అమరావతి: అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివా రం సాయంత్రం పెండ్లికుమారుడైన అమరేశ్వరుడిని పల్లకీ వాహనంలో, పెండ్లి కుమార్తె అయిన బాలచాముండేశ్వరీదేవిని పులివాహనంపై ఉంచి వైభవంగా పురవీధులలో ఊరేగించారు. ఆలయ ఈఓ రేఖ మాట్లాడుతూ భక్తులకు తెల్లవారుజామున మూడు గంటల నుంచే దర్శనం కల్పిస్తామని చెప్పారు. సాయంత్రం 4గంటల వరకు స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపా రు. భక్తులకు అందించేందుకు 50 వేల లడ్డూలను తయారు చేయించామని తెలిపారు. సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement