మద్యం విక్రయాలు జరిపిన హోంగార్డు సస్పెన్షన్ ?
సాక్షి నెట్‌వర్క్: కోటప్పకొండ తిరునాళ్లలో మద్యం విక్రయాలు నిర్వహించిన హోంగార్డు ఎన్.కోటేశ్వరరావును జిల్లా అధికారులు మంగళవారం సస్పెండ్ చేసినట్టు తెలిసింది. నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆయన తిరునాళ్లలో మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియా లో కూడా కథనాలు రావడంతో అధికారులు చర్య లు తీసుకున్నట్టు సమాచారం. తిరునాళ్ల సందర్భంగా మూడు రోజలపాటు కోటప్పకొండలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. తిరునాళ్లలో యథేచ్ఛగా విక్రయాలు జరిపా రు. హోంగార్డుతోపాటు మరో కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్నట్టు తెలిసింది. దీనిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం.


