ఎన్జీ రంగా వర్సిటీలో.. | - | Sakshi
Sakshi News home page

ఎన్జీ రంగా వర్సిటీలో..

Feb 18 2026 7:22 AM | Updated on Feb 18 2026 7:22 AM

ఎన్జీ రంగా వర్సిటీలో..

ఎన్జీ రంగా వర్సిటీలో..

భారత్‌ విస్తార్‌ వర్చువల్‌ ప్రోగ్రాం

గుంటూరు రూరల్‌: నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో మంగళవార భారత్‌ విస్తార్‌ డిజిటల్‌ వ్యవసాయంపై వర్చువల్‌ ప్రోగ్రాం నిర్వహించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌ నుంచి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ ప్రారంభించిన కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు వీక్షించారు. కార్యక్రమంలో విస్తరణ సంచాలకుడు డాక్టర్‌ శివనారాయణ మాట్లాడుతూ భారత్‌ విస్తార్‌ కార్యక్రమం రైతులకు తమ సొంత భాషలో ఫోన్‌ ద్వారా కానీ ఫోన్‌ కాల్స్‌ ద్వారా కానీ సమాచారాన్ని అందించేందుకు రూపొందించారన్నారు. పంటల ప్రణాళికలు, పద్ధతులు, తెగుళ్ళ యాజమాన్యం, వాతావరణ మార్పులు, మార్కెట్లు, రైతులకు వారి భాషలో ఏఐ టెక్నాలజీ ద్వారా అందజేస్తారన్నారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ పీవీ సత్యనారాయణ, ఇంజనీరింగ్‌ డీన్‌ డాక్టర్‌ ఎ. మణి, డాక్టర్‌ జి. రామచంద్రరావు, డాక్టర్‌ సంపత్‌కుమార్‌, డాక్టర్‌ పి. రవి, డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, వైవీ సుబ్బారావు, రామకృష్ణ, తిరుపతిరావు, విద్యార్థులు శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement