ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ముఖ్యం
భక్తులకు
ఎస్పీ, పోలీసు అధికారులకు గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశం
నరసరావుపేట: భక్తులు ప్రశాంత వాతావరణంలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా పోలీసులు విధులు నిర్వర్తించేలా చూడాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన తిరునాళ్లకు సంబంధించిన వివరాలను గుంటూరు ఐజీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఐజీకి పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు వివరించారు. తిరునాళ్లకు సంబంధించి రూట్ మ్యాప్ ద్వారా తీసుకుంటున్న వివరాలను తెలియచేశారు. దీనిపై ఐజీ పలు సూచనలు చేశారు. భక్తులతో మంచిగా వ్యవహరించాలని, ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో స్వామిని దర్శించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్ణీత ప్రదేశాలలో వాహనాలు నిలిపేలా దిశానిర్దేశం చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాలు, ప్రభల ప్రదర్శన ప్రాంతాలు, దేవుని దర్శించుకునే సమయంలో రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ (ఏఆర్) సత్తిరాజు, నరసరావుపేట ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


