ఈ పంట నమోదుపై సూపర్‌చెక్
నకరికల్లు: సాగు చేస్తున్న పంటలకు ఈ క్రాప్ నమోదు చేసుకోవడం ద్వారా వ్యవసాయ సంక్షేమపథకాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు అన్నారు. మండలంలోని నకరికల్లు, చల్లగుండ్ల గ్రామాల్లో ఈ పంట నమోదు చేసుకున్న పంటపొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు తనిఖీచేశారు. సూపర్‌చెక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26లో గ్రామాల్లోని రైతుసేవకేంద్రాల సిబ్బంది నమోదు చేసిన పంటలను జియోఫెన్సింగ్‌తో తనిఖీ చేశామన్నారు. మండలంలో రబీ సీజన్‌లో 7,752 హెక్టార్లలో వరి, 1,598 హెక్టార్లలో మొక్కజొన్న, 71 హెక్టార్లలో ఇతపంటలు సాగుచేస్తున్నట్లు నమోదైందన్నారు. జియోఫెన్సింగ్‌తో 18,839 ఎకరాల్లోని పంటలను నమోదు చేయడమైందన్నారు. సాగుచేస్తున్న పంటలకు ఈ పంటనమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతుసేవ కేంద్రాల సిబ్బందిని సంప్రదించి ఏపీఎఫ్‌ఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకొని రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కె.దేవదాసు, గ్రామ వ్యవసాయ సహాయకులు వై.ప్రభాకర్, ఎస్.విజయనరసింహ, ఏఈఓ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జియోఫెన్సింగ్ సూపర్‌చెక్‌లో పాల్గొన్న
జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు


