మణిపాల్ హాస్పిటల్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్ ది బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఇన్ హెల్త్‌కేర్ అవార్డు గెలుచుకున్న ఆసుపత్రి యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫన్ అండ్ జాయ్ సంస్థ, వరల్డ్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కాంగ్రెస్ సహకారంతో ఈ అవార్డును ముంబయి నగరం తాజ్‌ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి స్వీకరించారని పేర్కొన్నారు. రోగి క్షేమమే ప్రధానంగా వైద్యసేవల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు, హెల్త్‌కేర్ రంగంలో అగ్ర వైద్య సేవలు అందిస్తున్నందుకు ది బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఇన్ హెల్త్‌కేర్ అవార్డు లభించిందని తెలిపారు. మణిపాల్ ఏఏహెచ్‌ఆర్‌పీపీ అక్రిడిడేషన్ పొందిందని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


