టీడీపీ నేతల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ఆందోళన

Feb 11 2026 7:43 AM | Updated on Feb 11 2026 7:43 AM

టీడీపీ నేతల ఆందోళన

టీడీపీ నేతల ఆందోళన

ఎమ్మెల్యే ప్రత్తిపాటి నివాసం వద్ద

ఎమ్మెల్యే ప్రత్తిపాటి నివాసం వద్ద

చిలకలూరిపేట/యడ్లపాడు: సొంత పార్టీ వర్గీయులే తమకు అన్యాయం చేస్తున్నారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసం వద్ద మంగళవారం రాత్రి టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంఘటన సంచలనంగా మారింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. గ్రామ మాజీ సర్పంచ్‌ వర్గీయులైన రేషన్‌ డీలర్లను తొలగించి కొత్తవారికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు పావులూరి పిచ్చయ్య ఆధ్వర్యంలో యడ్లపాడు తహసీల్దార్‌ కార్యాలయం ముందు టీడీపీ వర్గీయులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్‌ డీలర్లను ఈ నెల డీడీలు కట్టవద్దని ఎందుకు ఆదేశించారు... ఉన్న వాళ్లను తొలగించేందుకే కదా అంటూ ఆందోళన నిర్వహించారు. దీనికి అధికారుల నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో ఆగ్రహించిన తిమ్మాపురం గ్రామస్తులు చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement