అర్ధరాత్రి ఒంటి గంట నుంచే త్రికోటేశ్వరస్వామి దర్శనం | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఒంటి గంట నుంచే త్రికోటేశ్వరస్వామి దర్శనం

Feb 11 2026 7:43 AM | Updated on Feb 11 2026 7:43 AM

అర్ధరాత్రి ఒంటి గంట నుంచే త్రికోటేశ్వరస్వామి దర్శనం

అర్ధరాత్రి ఒంటి గంట నుంచే త్రికోటేశ్వరస్వామి దర్శనం

అర్ధరాత్రి ఒంటి గంట నుంచే త్రికోటేశ్వరస్వామి దర్శనం మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరగనున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారులతో టెలీ కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభలు తరలింపునకు ఎటువంటి అంతరాయం కలుగకుండా రహదారులను తీర్చిదిద్దాలన్నారు. ప్రభల రాకపోకలకు విద్యుత్‌ వైర్లు తగలకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు సిబ్బందిని నియమించాలని సూచించారు. క్యూలైన్‌లో ఉండే భక్తులకు తాగునీరు ప్యాకెట్లు అందజేయాలని అన్నారు. కొండ క్రింద నుంచి పైవరకు భక్తుల తరలింపునకు ఘాట్‌రోడ్డుకు అనువైన అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ ఎస్పీతో కలసి ఏర్పాట్లపై సమీక్ష

నరసరావుపేట: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచే భక్తులకు త్రికోటేశ్వరస్వామి దర్శనం ప్రారంభిచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. మంగళవారం కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లలో ట్రాఫిక్‌ నిర్వహణపై కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభలు ఉదయం 11గంటలలోపే కొండ వద్దనున్న ప్రభల ప్రాంగణానికి చేరుకునేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. కొండపైకి 120 బస్సులు నడపాలని, షిఫ్టుల వారీగా సిబ్బందిని, అదనపు బస్సులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా పౌర రవాణా అధికారికి సూచించారు. నరసరావుపేట, చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే బస్సులకు ఆయా దారుల్లోనే వేర్వేరు బస్టాండ్‌లు ఏర్పాటు చేయాలని, డ్రోన్లు, సీసీ టీవీలతో కొండ ప్రాంగణం నిత్య పర్యవేక్షణ చేయాలని సూచించారు. కొండపై నిర్మించిన నూతన మొబైల్‌ టవర్‌ ట్రయల్‌ రన్‌ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఆర్‌టీఓ జి.సంజీవరావు, ఆర్‌టీసీ డీపీటీఓ జి.అజితకుమారి, ఆర్డీఓ కె.మధులత, డీఎస్పీ ఎం.హనుమంతరావు, తహసీల్దార్‌ వేణుగోపాలరావు, పలువురు జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement