సంభ్రమాశ్చర్యాలు
గుంటూరు మెడికల్: వైద్య వృత్తిపై మక్కువ పెంచేలా, వైద్య రంగం, మానవ శరీరంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా గుంటూరు వైద్య కళాశాలలో మెడ్‌ఫ్యూజన్ పేరుతో ఈనెల 4వ తేదీ నుంచి జరుగుతున్న మెడికల్ ఎగ్జిబిషన్ విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఎగ్జిబిషన్‌న్‌ను సోమవారం ఒక్కరోజే మొత్తం 2,209 మంది సందర్శించారు. ఇందులో ఒక్క ఇంటెల్ స్కూల్ నుంచి సుమారు 600 మంది విద్యార్థులు రావడం విశేషం. మెడికల్ కళాశాల ప్రాంగణం మొత్తం విద్యార్థుల విహారంతో కళకళలాడింది.
● మెడికల్ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన
● భారీగా తరలివస్తున్న విద్యార్థులు
● ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న
మెడ్‌ఫ్యూజన్
సిద్ధమవుతున్న బైరా వారి ప్రభ
ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న ఎగ్జిబిషన్....
కేవలం విద్యార్థులనే కాకుండా పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మెడ్‌ఫ్యూజన్ మెడికల్ ఎగ్జిబిషన్ బాగా ఆకట్టుకుంటుంది. సందర్శకుల రాక రోజు రోజుకు పెరుగుతుండడంతో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి ఆధ్వర్యంలో వైద్య బృందం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీక్షకులకు ఎలాంటి అవాంతరాలు, అవరోధాలు లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నారు.
అనస్తీషియా విభాగం నిర్వహించిన ఎగ్జిబిషన్ విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అనస్తీషియా విభాగంలో ఏర్పాటు చేసిన ఫొటో బూత్ వద్ద విద్యార్థులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. ఈ ఫొటో బూత్ ద్వారా అనస్తీషియాలజిస్టు చేసే వివిధ విధులు, ఆయన పాత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి వైద్య విభాగం ప్రత్యేకమే....
గుంటూరు వైద్య కళాశాలలో ఉన్న ప్రతి వైద్య విభాగం కూడా మెడికల్ ఎగ్జిబిషన్‌లో పాల్గొంది. ఆయా వైద్య విభాగాల ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న విజ్ఞాన విషయాలు, ఆరోగ్యకరమైన అంశాలు, అందరిని ఆకట్టుకుంటున్నాయి.
అనస్తీషియా వైద్య విభాగం ఆధ్వర్యంలో కాలక్రమంలో జరిగిన మార్పులు, అభివృద్ధిని బయోస్కోప్ ద్వారా ప్రదర్శించారు. విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు.
వివిధ నరాలను ఉత్తేజితం చేసినప్పుడు శరీర అవయవాలు ఎలా స్పందిస్తాయో చూపించే ఎగ్జిబిట్‌కు విశేష ఆదరణ లభించింది. విద్యార్థుల చేతుల ద్వారానే ఇంట్యూబేషన్ ప్రక్రియను ప్రాక్టికల్‌గా చేయించి చూపించారు. దీంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనాటమీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానవ అస్థి పంజరాలు, శరీర అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, లివర్, మెదడు వంటి అవయవాలు కళ్లతో చూసి ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతున్నారు.
తల్లి కడుపులో ఉండే పసి పిండాలను రసాయనాల్లో నిల్వచేసి చూపిస్తున్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది.
ఫార్మాకాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో మందుల తయారీ, ఏఏ జబ్బులకు ఏఏ మందులు పని చేస్తున్నాయో తెలిపే చార్ట్‌లు, పెథాలజీ వైద్య విభాగం, రేడియాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వ్యాధులను ఏ విధంగా గుర్తిస్తారనే విషయాలు ఆకట్టుకుంటున్నాయి.
న్యూరాలజీ వైద్య విభాగం ఆధ్వర్యంలో బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది. మెదడుకు వచ్చే సమస్యలు, చికిత్సలు తెలిపేలా ఏర్పాటు చేసిన చార్ట్‌లు, చిత్రాలు పిల్లల చిట్టిమెదడులో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.
పిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ చిన్నారులను , విద్యార్థులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రతి వైద్య విభాగం దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంది.
సంభ్రమాశ్చర్యాలు
సంభ్రమాశ్చర్యాలు
సంభ్రమాశ్చర్యాలు


