ప్రభవించిన భక్తిభావం..!
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు అన్న ప్రసాదాలు అందించిన స్వచ్ఛంద సంస్థలు కేదారేశ్వరుని సేవలో జస్టిస్ సురేష్‌రెడ్డి దంపతులు
కోటప్పకొండ తిరునాళ్లకు తరలిన ప్రభలు, భక్తులు
నరసరావుపేట ఈస్ట్: అన్ని దారులు శివయ్య సన్నిధికే.. కోటప్పకొండలో కొలువైన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలి వెళుతున్న భక్తులతో నరసరావుపేట పట్టణం భక్తజన సంద్రంగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కోటప్పకొండకు అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ మార్గాలలో భక్తుల సందడి అధికంగా కనిపించింది. పల్నాడురోడ్డు, స్టేషన్‌రోడ్డు, చిత్రాలయ సెంటర్‌లో యాత్రికుల తాకిడి కనిపించింది. పురపాలక సంఘం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, పల్నాడు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ప్రధాన మార్గాల్లో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆధ్వర్యంలో అన్నప్రసాదాలను యాత్రికులకు అందించారు. కొండ దిగువన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన స్టాళ్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
శివాలయాలలో ప్రత్యేక పూజలు..
పట్టణంలోని శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతూరులోని భీమలింగేశ్వరస్వామి, పల్నాడురోడ్డులోని కళ్యాణ సుందరేశ్వరస్వామి, వల్లప్పచెరువులోని కేదారేశ్వరస్వామి, బరంపేటలోని వాయు మల్లేశ్వరస్వామి తదితర ఆలయాలలో పూజలు నిర్వహించారు. హైకోర్లు న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి దంపతులు కేదారేశ్వరస్వామి వారికి అభిషేకాలు, పూజలు జరిపారు.
కొండకు తరలిన ప్రభలు
ప్రభల పండగ్గా పేరుపొందిన మహాశివరాత్రి పర్వదినాన జరిగే కోటప్పకొండ తిరునాళ్లకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభలు తరలివెళ్లాయి. ఉదయం తల్లిదండ్రులు తమ చిన్నారులతో మొక్కుబడి ప్రభలను తీసుకొని కొండకు వెళ్లారు.
ప్రభవించిన భక్తిభావం..!
ప్రభవించిన భక్తిభావం..!
ప్రభవించిన భక్తిభావం..!
ప్రభవించిన భక్తిభావం..!
ప్రభవించిన భక్తిభావం..!


