హరహర.. త్రికోటేశ్వరా..
న్యూస్‌రీల్
త్రికోటేశ్వరునికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ
బాల ప్రభలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు
నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మహిళలు ఆలయం వెనుక రావిచెట్టు, మహానంది, నాగేంద్రుని పుట్ట వద్ద పూజలు చేశారు. పొంగళ్లు పొంగించి స్వామి వారికి సమర్పించారు. సోఫాన మార్గం నుంచి మెట్ల పూజ చేసుకుంటూ భక్తులు కొండ మీదకు చేరుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు.
ఉచిత, శీఘ్ర, అభిషేక క్యూలైన్‌ల ద్వారా భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఆనందవల్లి అమ్మవారి ఆలయం భక్తలతో కిక్కిరిసింది. దర్శన అనంతరం భక్తులకు ఉచిత ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లపై భక్తులు కొండకు చేరుకున్నారు. దీంతో కొండపై పార్కింగ్ ప్రాంతం వాహనాలతో నిండిపోయింది.
నరసరావుపేట పరిసర ప్రాంతాల నుంచి బాలప్రభలతో భక్తులు కొండకు వచ్చారు.
ఘాట్‌రోడ్డులోని ప్రకృతి పర్యావరణ కేంద్రం వద్ద యాత్రికులు సందడి కనిపించింది.
నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపి భక్తులను కొండకు చేరవేసింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
గిరిప్రదక్షణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివనామస్మరణ చేసుకుంటూ గిరిప్రదక్షణ పూర్తిచేశారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ మట్టం శుక్రవారం 536.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 4900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 36.0467 టీఎంసీలు.
అమ్మవారికి బోనాలు
గురజాల:పల్లెగుంత రోడ్డులో వేంచేసి ఉన్న లక్ష్మీతిరుపతమ్మ గోపయ్యస్వామి వారికి శుక్రవారం బోనాలు సమర్పించారు. మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి పూజలు చేశారు.
ఈ–పంట.. మేలంట
గజ వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏకాదశి నుంచి మహాశివరాత్రి వరకు మూడు రోజుల పాటు కోటప్పకొండలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం కోటప్పకొండలో భక్తుల రద్దీ నెలకొంది వేలాది మంది స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూలవిరాట్ అభిషేకాలు నిలిపివేయడంతో అభిషేక మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు.
హరహర.. త్రికోటేశ్వరా..
హరహర.. త్రికోటేశ్వరా..
హరహర.. త్రికోటేశ్వరా..
హరహర.. త్రికోటేశ్వరా..
హరహర.. త్రికోటేశ్వరా..


