శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు
బాపట్ల బాపట్ల పట్టణంలోని జాతీయ రహదారి వద్ద మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య డిమాండ్ చేశారు. విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని గురువారం చల్లా రామయ్య సందర్శించారు. ఉమ్మడి రాష్ట్రాల తెలుగు ప్రజల గుండెచప్పుడుగా ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం, స్మృతివనం నిర్మించేందుకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముందుకొచ్చి శంకుస్థాప చేపడితే అడ్డంకులు కల్పించటం సరైన పద్ధతి కాదన్నారు. స్మృతివనం ప్రదేశంలో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి కుట్రలను చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. విగ్రహాన్ని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఏర్పాటు చేసేవరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ నాయకులు బోడా జాన్ (నాని), డి.పాల్, ఆవుల గోపిరెడ్డి, బి.సోమయ్య, డి.సంజీవులు, బి.గోపి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా


