అతివేగంతో ఢీకొన్న లారీలు
దాచేపల్లి: అతివేగంతో వెళ్తున్న రెండు లారీ పరస్పరం ఢీకొన్నాయి. మండలంలోని శ్రీనగర్ గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద సోమవారం జరిగిన ఈ ఘటన నేపథ్యంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. స్థానికుల కథనం ప్రకారం... దాచేపల్లి వైపు నుంచి రెండు లారీలు అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై తెలంగాణకు వెళ్తున్నాయి. ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టెక్ చేసే వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక లారీ ఫల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కన పడిపోగా మరో లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిత్య రద్దీగా ఉండే ఈ హైవేపై రెండు లారీలు ఢీకొనటంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. సంఘటన స్థలాన్ని పోలీసులు, హైవే అధికారులు పరిశీలన చేసి బోల్తాపడిన లారీలను క్రేన్ సహాయంతో పైకి లేపారు.
అతివేగంతో ఢీకొన్న లారీలు


