అమరావతిలో భక్తుల కోసం వైద్య శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

అమరావతిలో భక్తుల కోసం వైద్య శిబిరాలు

Feb 14 2026 7:59 AM | Updated on Feb 14 2026 7:59 AM

అమరావ

అమరావతిలో భక్తుల కోసం వైద్య శిబిరాలు

అమరేశ్వరుని సేవలో కార్మిక శాఖ మంత్రి సుభాష్‌ నిమ్మకాయల ధరలు

అమరావతి: అమరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తుల కోసం ఏర్పాటు చేయనున్న వైద్యశిబిరాలపై శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవి సమీక్షించారు. అమరేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ రాజా వాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్‌, ఈవో రేఖలతో కలిసి వైద్య శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై చర్చించారు. అనంతరం సిబ్బందికి, శిబిరాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రతలు వివరించా రు. భక్తులకు అరోగ్యశాఖ సేవలు 24గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఐఓ డాక్టర్‌ హనుమకుమార్‌, డాక్టర్‌ శివరత్నకుమార్‌, డాక్టర్‌ మౌనిక ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరున్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సుభాష్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా రాజరాజ నరేంద్ర స్వామి వార్షిక మహోత్సవాలు

పెదపులివర్రు(భట్టిప్రోలు):భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొలువైన బాలా త్రిపుర సుందరి సమేత రాజరాజ నరేంద్ర స్వామి వార్షిక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ఆమంచి సృజన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపారు. శుక్రవారం ఉదయం, సాయంత్రం నిత్యహోమం బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి గ్రామోత్సవం, నెమలి వాహన సేవ జరిగింది. కార్యక్రమాలను ఈవో ఇ.సాంబశివరావు పర్యవేక్షించారు.

మహాశివరాత్రికి మల్లయ్య గట్టుకు లాంచీలు ఏర్పాటు

విజయపురిసౌత్‌: ఏపీ పర్యాటక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన అనుపు నుంచి ఏలేశ్వరం స్వామి మల్లయ్య గట్టుకు ప్రత్యేక లాంచీలను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక లాంచీ స్టేషన్‌ యూనిట్‌ మేనేజర్‌ మస్తాన్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఏలేశ్వరం గట్టుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం స్పెషల్‌ లాంచీలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. టికెట్‌ ధర పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.150 గా నిర్ణయించడమైందన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్పెషల్‌ లాంచీల కోసం భక్తులు 97051 88311, 94414 53115 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6300, మోడల్‌ ధర రూ.5800 వరకు పలికింది.

అమరావతిలో భక్తుల కోసం వైద్య శిబిరాలు 1
1/1

అమరావతిలో భక్తుల కోసం వైద్య శిబిరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement