కల్యాణం... కమనీయం...
సత్రశాల(రెంటచింతల): సత్రశాల గంగా భ్రమరాంబా సమేత మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం అర్ధరాత్రి 1 గంట నుంచి 3.30 గంటల వరకు నిర్వహించిన స్వామి వార్ల కల్యాణం కన్నులపండువగా సాగింది. వరకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణ వేడుకలు అర్చకులు భువణగిరి కృష్ణ నేతృత్వంలో కన్నులపండువగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కల్యాణ వేడుకల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనులార వీక్షించారు. మహాశివ రాత్రి ప్రత్యేక అధికారి వి.లీలావతి, ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డి, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


