టీడీపీలో చిటపటలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో చిటపటలు

Feb 12 2026 7:30 AM | Updated on Feb 12 2026 7:30 AM

టీడీప

టీడీపీలో చిటపటలు

టీడీపీలో చిటపటలు భగ్గుమన్న వర్గ విభేదాలు ● యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు పావులూరి పిచ్చయ్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి యడ్లపాడు తహసీల్దార్‌ కార్యాలయం ముందు తమ గ్రామానికి చెందిన రేషన్‌ డీలర్లను తొలగిస్తున్నారంటూ బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గ్రామానికి చెందిన మహిళలు, పురుషులు అంతా కలసి చిలకలూరిపేట పట్టణంలోని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కాకుండా కొత్తవారిని అందలం ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ● ఈ క్రమంలోనే తమ వర్గానికి చెందిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించారని, ఒక హోమ్‌ గార్డును సైతం ఇక్కడ నుంచి బదిలీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ● ఇలా ఆందోళనకు దిగిన వారంతా తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచ్‌, ప్రస్తుత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏగా వ్యవహరిస్తున్న పావులూరి శ్రీనివాసరావు అనుచరులు కావడం విశేషం.

విభేదాలకు కారణం...

ౖపైపె కారణాలు ఏమైనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేది పావులూరి శ్రీనివాసరావు అనే ప్రచారం నియోజకవర్గంలో చాపకింద నీరులా పాకుతోంది. దీనికి మూల కారణం శ్రీనివాసరావు అని ఎమ్మెల్యే వర్గీయుల అనుమానం.

ఈ విషయాలను బలపరుస్తూ జనవరి 12న తిమ్మాపురం గ్రామంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆధ్వర్యంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. వీటికి గ్రామ మాజీ సర్పంచ్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు పావులూరి శ్రీనివాసరావును పిలవకుండా దూరంగా ఉంచారు. గ్రామంలోనే మరో నాయకుడికి పెద్ద పీట వేశారు. దీంతో పావులూరి వర్గీయులు సైతం కార్యక్రమంలో పాల్గొనకుండా దూరం పాటించారు.

ఈ సంఘటన తర్వాత ఇరు వర్గాల మధ్య అంతరాలు పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తమ వర్గానికి చెందిన వారిపై ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు వరుసగా వేటు వేస్తూ వస్తున్నారని ఆందోళనకు దిగిన వారు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే రేషన్‌ డీలర్లను తొలగించి కొత్త వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపణలకు దిగారు.

ఎంతకూ ఆందోళనకు దిగిన వారు వెనక్కు తగ్గకుండా ఎమ్మెల్యే ఇంటి ముందే, ఎమ్మెల్యే వర్గీయులపై దూషణలకు దిగడంతో అర్బన్‌, రూరల్‌ సీఐలు పి.రమేష్‌, బి.సుబ్బానాయుడు సిబ్బందితో వచ్చి ఆందోళనకు దిగిన వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే నివాసం వద్దకు పావులూరి శ్రీనివాసరావు చేరుకోవడంతో ఆందోళనకు దిగిన వారు మరింతగా రెచ్చిపోయి దూషణలకు దిగారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పుల్లారావు, మాజీ సర్పంచ్‌ పావులూరి మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి ఒక కొలిక్కి రాలేదని తెలిసింది.

చివరకు పోలీసుల జోక్యంతో ఆందోళనకు దిగిన వారు అసంతృప్తిగానే అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యే నివాసం వద్ద నుంచి వెళ్లి పోయారు.

తమకు అన్యాయం చేస్తున్నారంటూ

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేషన్‌ డీలర్లను తొలగించారంటూ ఆగ్రహం

అర్ధరాత్రి వరకు దూషణల పర్వం... పోలీసుల జోక్యంతో వివాదానికి తెర

భగ్గుమన్న వర్గ విభేదాలు

టాస్క్‌ఫోర్స్‌: పల్నాడు జిల్లా చిలకలూరిపేట టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంతపార్టీకి చెందిన రేషన్‌ డీలర్లను తొలగించాలన్న ప్రయత్నం కాస్తా బెడిసి ఎమ్మెల్యే ఇంటిముందే టీడీపీ వర్గీయులే ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడింది. నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సైతం ఒక్కసారిగా భగ్గుమంది. అధికార పార్టీకి చెందిన వారే చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసం ముందు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం చూసేవారికి సాధారణంగా కానవస్తున్నా అంతర్గతంగా ఆధిపత్యపోరే కారణమని తెలియవస్తోంది.

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించిన సొంత పార్టీ వర్గీయులు

టీడీపీలో చిటపటలు1
1/1

టీడీపీలో చిటపటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement