పెట్రోల్ బంకుల్లో కనీస వసతులు తప్పనిసరి
గుంటూరు వెస్ట్: పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు అవసరమైన కనీస సదుపాయాలనై తాగునీరు, మరుగుదొడ్లు, గాలి మెషిన్ తదితరవి ఉండాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో డిఎస్‌ఓ కోమలి పద్మతో కలిసి ఐఓసి, హెచ్‌పీసీ, బీపీసీ పెట్రోల్ బంకుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆయిల్ ట్యాంకర్లకు, మొబైల్ బౌజర్లకు తప్పనిసరిగా ఫామ్– ఎఫ్ లైసెన్స్‌లు పొందాలన్నారు. ఖాతాదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. బంకుల్లోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పెట్రోల్ బంకుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెట్రోల్ బంకు యజమానులు తెలిపిన కొన్ని ఇబ్బందులపై జేసీ సానుకూలంగా స్పందించారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ


