వినియోగదారుల హక్కులు కాపాడాలి
గుంటూరు వెస్ట్: వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... కమిటీ సభ్యులు సూచించిన అంశాలసౌ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో నీళ్ల ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ రకాల పరీక్షలు, స్కానింగ్‌కు నిర్దేశిత ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆహార తనిఖీ విభాగం హోటళ్లపై నిఘా పెట్టి కేసులు నమోదు చేయాల్సి ఉందని వివరించారు. గ్యాస్ డెలివరీ బాయ్ వినియోగదారుల నుంచి అధికంగా నగదు వసూలు చేస్తున్నారని, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల వద్ద రంగుల ఐస్ క్రీములు, హానికరమైన ఆహార పదార్థాల విక్రయాన్ని కట్టడి చేయాలని సూచించారు. నగరంలో ప్లాస్టిక్ తయారీ కేంద్రాలను గుర్తించి, వాటిని తనిఖీ చేయాలని అన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ పి.కోమలి పద్మ, డ్వామా పీడీ కె.కళ్యాణ చక్రవర్తి, సీపీడీసీఎల్ కార్యనిర్వహక ఇంజినీర్ రమేష్, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.
గుండవరం(చేబ్రోలు): మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభలు ప్రధాన ఆకర్షణ. దీనిలో భాగంగా ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి గొడవర్రు గ్రామ ప్రభ, గుండవరం గ్రామ ప్రభలు క్రమం తప్పకుండా ఆనవాయితీగా ముందు వరసలో ఉంటాయి. వంద సంవత్సరాల నుంచి గ్రామ ప్రభలు భారీ విద్యుత్ ప్రభలను నిర్మించుకొని భక్తిశ్రద్ధలతో గ్రామంలో మహాశివరాత్రి ముందురోజు ఊరేగింపు నిర్వహించి అనంతరం పండుగ రోజున భక్తుల శివనామస్మరణలతో ఆలయానికి చేరుకుంటాయి. గుండవరం గ్రామానికి చెందిన చుక్కా వంశస్తులు ఒక సంవత్సరం, టంకశాల వంశస్తులు మరో సంవత్సరం గ్రామ ప్రభను నిర్మించి క్వారీ ఆలయానికి గ్రామ ప్రభను తీసుకువెళ్లటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఏడాది చుక్కా వంశస్తులు గ్రామ ప్రభను నిర్మిస్తున్నారు.
గుంటూరు మెడికల్: బీజేపీ జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీ సభ్యులు శుక్రవారం గుంటూరు లాల్‌పురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు సమక్షంలో జిల్లా మహిళ మోర్ఛా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాజామాధవి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ అన్నారు. మహిళ మోర్చా ఉపాధ్యక్షునిగా వాణి వెంకట్, సాధువాణి, లక్ష్మీదేవి, చాముండేశ్వరి, స్వాతి, విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా కాసు శ్రీదేవి, కఠారి పద్మజ, కార్యదర్శులుగా రాధిక, రమ్య, రమాదేవి, లక్ష్మీప్రసన్న, పర్హానా, కోశాధికారిగా డాక్టర్ స్రవంతి, సోషల్‌మీడియా కన్వీనర్‌గా వెంకటలక్ష్మి, కార్యనిర్వాహక సభ్యులుగా లీలారాణి, ఉష, లీల, దుర్గా, పద్మా, బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహిళ మోర్చా కమిటీకి మహిళ మోర్ఛా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడ్డి నాగమల్లేశ్వరి, గుంటూరు మిర్చి యార్డు డైరెక్టర్ శ్రావణ్‌కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈదర శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భజరంగ్ రామకృష్ణ, తదితరులు అభినందనలు తెలిపారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
వినియోగదారుల హక్కులు కాపాడాలి
వినియోగదారుల హక్కులు కాపాడాలి
వినియోగదారుల హక్కులు కాపాడాలి


