స్తంభించిన ట్రాఫిక్
మెట్లమార్గం పట్టిన భక్తులు
నరసరావుపేటరూరల్:కోటప్పకొండ ఘాట్‌రోడ్‌లో ట్రాఫిక్ స్తంభించడంతో మెట్ల మార్గంలో కిందకి వెళ్లే వారిని పోలీసులు నిలిపివేశారు. దీంతో రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కోటప్పకొండ మీద భక్తులు స్తంభించిపోయారు. ఘాట్‌రోడ్లో ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురికావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కొండమీద భక్తులు కిందకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడ్డారు. దీంతో వారు మెట్లమార్గం బాట పట్టారు. ఈ సమయంలోనే పదేళ్ల నందిని ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుంది. రాత్రికి ప్రసాదాల కొరత ఏర్పడింది. ముందుగా సిద్ధం చేసిన లడ్డూ ప్రసాదం విక్రయాలు రాత్రి ఏడుగంటలతో పూర్తయ్యాయి. అప్పటి నుంచి ప్రసాద విక్రయాలు నిలిపివేశారు. ప్రసాదాల కోసం కౌంటర్ల ముందు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.
కోటప్పకొండలో రెండువైపులా స్తంభించిన ట్రాఫిక్
కోటప్పకొండలో ఆదివారం రాత్రి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఘాట్‌రోడ్డులో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో మెట్లమార్గం వైపుకు భక్తులు వెళ్లినా వారు కిందకు, కింది నుంచి పైకి రాలేని పరిస్థితి నెలకొంది.


