మైనారిటీలకు మరోసారి ద్రోహమే
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్కడా.. మైనారిటీ సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఏదో నామ్‌కే వాస్తే.. నిధులు కేటాయించారు తప్ప.. స్పష్టంగా ఏ పథకానికి ఇచ్చారో తెలియదు. దుల్హన్ పథకం, విదేశీ విద్య, మైనారిటీల స్కాలర్‌షిప్‌లకు ఒక్క రూపాయి కేటాయించలేదు. మైనారిటీలు వ్యాపారం చేసుకునేందుకు రూ. 5లక్షల రుణాలు ఇస్తామన్న చంద్రబాబు దాని కోసం ఎన్ని కోట్లు కేటాయించారో.. చెప్పాల్సిన అవసరం ఉంది. బడ్జెట్‌లో ఎక్కడ కూడా రంజాన్‌తోఫా, మసీదుల మరమ్మతు కోసం నిధులు కేటాయింపు లేదు. మరోసారి మైనారిటీలను నిలువునా వంచించారు. ముస్లింలను అన్ని విషయాల్లో చంద్రబాబు చిన్నచూపుతోనే చూశారు.
– పఠాన్ అబ్దుల్లాఖాన్,మౌజాన్ అసోసియేషన్, జిల్లా అధ్యక్షుడు


