పెళ్లి కుమారుడైన అమరేశ్వరుడు
అమరావతి: బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం వేద పండితులు, అర్చకులు అమరేశ్వరుడికి పెండ్లి కుమారునిగా అలంకరణ చేశారు.
ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో బాలచాముండికా సమేత అమరేశ్వరుడికి విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత ఆలయ అనువంశిక ధర్మకర్త రాజావాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్, స్వామి వారికి కల్యాణోత్సవ పట్టువస్త్రాలను సమర్పించారు. అమరేశ్వరునికి వేకువ జామున అభిషేకం చేసి నూతన వస్త్రఽ దారణతో పెండ్లి కుమారుని చేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ కల్యాణోత్సవాలకు అర్చకులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి రేఖ చేతుల మీదుగా దీక్షా వస్త్రాలు సమర్పించారు.


