సామాజిక అవసరాలు తీర్చేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

సామాజిక అవసరాలు తీర్చేందుకు కృషి

Feb 12 2026 7:33 AM | Updated on Feb 12 2026 7:33 AM

సామాజిక అవసరాలు తీర్చేందుకు కృషి

సామాజిక అవసరాలు తీర్చేందుకు కృషి

చిలకలూరిపేట: ముస్లిం మైనార్టీల సామాజిక అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ రఫాని చెప్పారు. బుధవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో ముస్లిం మైనార్టీ నాయకులు, సంబంధిత వార్డు ప్రజా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మద్దినగర్‌, సుభానినగర్‌లలో ఉన్న కమ్యూనిటీ భవనాల అభివృద్ధి పనుల కోసం ఒక్కొక్క భవనానికి రూ. 30 లక్షల చొప్పున రూ. 60 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో కమ్యూనిటీ భవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. సమావేశానికి హాజరైన ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ మదర్‌థెరిస్సా కాలనీ, టిడ్కో, ఆరిఫుల్లా నగర్‌, ఎన్‌టీఆర్‌ కాలనీ ప్రాంతాకు సంబంధించి ముస్లిం స్మశానవాటిక ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరారు. అలాగే పురుషోత్తమపట్నంలో ముస్లిం కమ్యూనిటీ అవసరాల నిమిత్తం మరో కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్‌ను ముస్లింలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అంజుమన్‌ ఇస్లామియా కమిటీ సభ్యులు, వివిధ వార్డుల ముస్లిం కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పేట మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ రఫాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement