వెట్టి చాకిరి తీవ్రమైన నేరం | - | Sakshi
Sakshi News home page

వెట్టి చాకిరి తీవ్రమైన నేరం

Feb 13 2026 3:39 AM | Updated on Feb 13 2026 3:39 AM

వెట్టి చాకిరి తీవ్రమైన నేరం

వెట్టి చాకిరి తీవ్రమైన నేరం

చీరాలటౌన్‌: వెట్టి చాకిరి తీవ్రమైన నేరం.. ఎవరైనా వెట్టిచాకిరీకి వ్యక్తులను నియమించుకోవడం నేరమని చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖరనాయుడు తెలిపారు. వెట్టి చాకిరి చట్టం అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయినందున జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ప్రజల్లో అవగాహన పంపొందించేందుకు వెట్టి చాకిరి నేరం వాల్‌పోస్టర్‌ గురువారం చీరాల ఆర్డీవో ఆవిష్కరించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం వెట్టిచాకిరి నిర్మూలించిందని, ఎవరైనా ముందస్తుగా డబ్బు, అప్పులు, ఇతర కారాణాలతో వ్యక్తులను బలవంతంగా పని చేయడం విరుద్ధమన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఎక్కడైనా వెట్టి చాకిరికి నియమించుకున్న సమాచారం తహసీల్దార్‌ కార్యాలయాల్లో అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో షాడోస్‌ ప్రతినిధి రాజా సాల్మన్‌, దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ భగవాన్‌ దాస్‌, షాడోస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement