సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు ఘన నివాళి

Feb 18 2026 7:22 AM | Updated on Feb 18 2026 7:22 AM

సీఆర్

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు ఘన నివాళి

నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వజ్రగిరి రవీంద్ర (30) అంత్యక్రియలు మంగళవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాల ఆధ్వర్యంలో అధికారికంగా జరిపించారు. నకరికల్లుకు చెందిన వజ్రగిరి రవీంద్ర సీఆర్‌పీఎఫ్‌లో జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వరిస్తున్నాడు. ఇటీవల సెలవుపై ఇంటికి వచ్చి తిరిగి డ్యూటీలో చేరేందుకు విజయవాడకు బయలుదేరాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గంమధ్యలో ఫిరంగిపురం సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుఝామున మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం సోమవారం రాత్రి మృతదేహాన్ని నకరికల్లుకు తరలించారు. అనంతరం మంగళవారం గౌరవవందనం సమర్పించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు అధికారిక లాంఛనాలతో అంతఃక్రియలు జరిపించారు. అంతఃక్రియల్లో కుటంబసభ్యులతో పాటు స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు ఘన నివాళి 1
1/1

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు ఘన నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement