తిరునాళ్ల విధులను ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించాలి
ఎస్పీ బి.కృష్ణారావు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. తిరునాళ్ల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి బ్రీఫింగ్ కార్యక్రమం శనివారం జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ బందోబస్తుకు హాజరైయ్యే పోలీసు అధికారులు, సిబ్బంది తిరునాళ్ల విధులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. డ్యూటీ ప్రాంతంలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం అందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు.


