సెపక్‌ తక్రా విజేత యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల | - | Sakshi
Sakshi News home page

సెపక్‌ తక్రా విజేత యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల

Feb 21 2026 7:33 AM | Updated on Feb 21 2026 7:33 AM

సెపక్‌ తక్రా విజేత యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళా

సెపక్‌ తక్రా విజేత యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళా

సత్తెనపల్లి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్‌ కళాశాలల పురుషుల సెపక్‌ తక్రా పోటీలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని విద్యాకేంద్రం డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు.ఈ టోర్నమెంట్‌ లో మొత్తం 8 జట్లు పాల్గొనగా నాకౌట్‌ కమ్‌ లీగ్‌ పద్ధతిలో పోటీలు జరిగాయి. విజేతగా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సాధించగా ద్వితీయ స్థానాన్ని వాసవీ డిగ్రీ కళాశాల నరసరావుపేట సాదించింది అదే విధంగా తృతీయ స్థానాన్ని ప్రగతి డిగ్రీ కళాశాల సత్తెనపల్లి సాధించింది. విజేతలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పి.పి.యస్‌పాల్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు. వారితో పాటుగా ఏజీకేఎం కళాశాల రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ దాసరి కోటేశ్వర రావు, సెలక్షన్‌ కమిటీ మెంబర్స్‌ ధనలక్ష్మీ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సి.హెచ్‌.వెంకట్రావు, వై వేలంగిని రెడ్డి, కళాశాల డైరెక్టర్‌ షేక్‌ జానీ భాష, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ రెడ్డి,ఆర్గనైజ్‌ సెక్రెటరీ పుచ్చకాయల శివరామకృష్ణ, క్రీడాకారులు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement