పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Feb 13 2026 3:39 AM | Updated on Feb 13 2026 3:39 AM

పల్నా

పల్నాడు

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 నేటి నుంచి కోటప్పకొండ మహాశివరాత్రి మహోత్సవం పులిచింతల సమాచారం నిమ్మకాయల ధరలు బాల సదనం నుంచి ఇద్దరు చిన్నారులు పరారీ తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

న్యూస్‌రీల్‌

మూడు రోజుల పాటు కొండలో భక్తుల రద్దీ ఏకాదశి నుంచి భక్తుల రాక ప్రారంభం పండుగ రోజున జాగరణతో ముగియనున్న జాతర లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

తిరునాళ్ల ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం

గత ఏడాది శివరాత్రి రోజున 1.20 లక్షల మంది త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఏడాది 1.50 లక్షల మంది దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.

కొండ దిగువన జరిగే జాతర మహోత్సవంలో 15 నుంచి 20 లక్షల మంది పాల్గొంటారని అధికారుల అంచనాగా ఉంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు.

స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూలైన్‌లు, స్వామి వారి ప్రసాదాలు లడ్డూ, అరిసెలను సిద్ధం చేశారు.

ఎండ వేడిమి లేకుండా చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులకు అందజేసేందుకు వాటర్‌ బాటిల్స్‌, మజ్జిగ, బిస్కెట్‌ ప్యాకెట్స్‌, పాలు అందుబాటులో ఉంచారు. కొండ దిగువన ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు.

ఆర్‌ అండ్‌ బీ లైటింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, స్నాన ఘాట్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. బారికేడింగ్‌ పనులు గురువారం ప్రారంభించారు. స్నానఘాట్‌ల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు సిద్ధం చేశారు. తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఏకాదశి నుంచే కోటప్పకొండకు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపే విధంగా ఏర్పాట్లు చేసింది. నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు, వినుకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులతో భక్తులను కొండకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

ఏకాదశి రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొండ మీద పార్కింగ్‌ రద్దీని బట్టి కార్లు, ట్రాక్టర్లకు అనుమతిస్తామని రూరల్‌ ఎస్‌ఐ కిషోర్‌ తెలిపారు.

శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
నేటి నుంచి కోటప్పకొండ మహాశివరాత్రి మహోత్సవం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి

దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.0923 టీఎంసీలు.

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4,800, గరిష్ట ధర రూ.6,000, మోడల్‌ ధర రూ.5,400 వరకు పలికింది.

బాపట్ల టౌన్‌: బాపట్లలోని బాలిక సదనంలో 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వసతిగృహం నుంచి పారిపోయారు. తల్లిదండ్రులు లేని వారు, అనాథలు, రక్షణ కరువైన బాలికలకు నీడ కల్పించడమే బాల సదనం ముఖ్య ఉద్దేశం. 6–18 ఏళ్ళలోపు బాలికలకు ఉచిత ఆశ్రయంతోపాటు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుధవారం అర్ధరాత్రి బాపట్ల బాలిక సదనంలో జరిగిన ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. వసతిగృహం వార్డెన్లు, సూపరింటెండెంట్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. సహచర విద్యార్థులు ఈ విషయాన్ని చెప్పడంతో గంట తర్వాత వారు అప్రమత్తమయ్యారు. ఆచూకీ లభించకపోవడంతో రాత్రి 10.30 గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో గాలించారు. పట్టణ శివారులోని కంకటపాలెం గేటు సమీపంలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కొన్నేళ్లుగా వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. అధికారులు వారిని చిత్రహింసలకు గురిచేయటం, వెట్టిచాకిరి చేయించడంతోనే పారిపోవాల్సి వచ్చిందని సమాచారం. ఇటీవల బంధువులకు ఫోన్‌ చేసినప్పుడు కూడా తాము ఇక్కడ ఉండలేకపోతున్నామని, ఇంటికి వచ్చేస్తామని వాపోయినట్లు తెలిసింది. బాల సదనం సూపరింటెండెంట్‌ ఎస్‌.సుబ్బలక్ష్మి మాట్లాడుతూ... హాస్టల్‌ గేటుకు వేసిన తాళాలు తీసుకొని వారిద్దరు పారిపోయారని, పోలీసుల సహాయంతో రాత్రి 10.45 గంటల సమయంలో తిరిగి తీసుకొచ్చామని తెలిపారు.

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కృతిక శుక్లా తెలిపారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి కోటప్పకొండలో గురువారం ఆమె పర్యటించారు. క్యూలైన్‌లు, పార్కింగ్‌ ప్రదేశాలను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండకూడదని ఆదేశించారు. ఆర్డీవో మధులత, ఈవో డి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా వైఎస్సార్‌సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కోటప్పకొండలో గురువారం ఆయన పర్యటించి తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించారు. లక్షలాది మంది వచ్చే తిరునాళ్లకు అరకొరగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు జరిగితే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సత్రాలకు నీటిని సరఫరా చేసే శంభులింగం చెరువును ఇప్పటి వరకు నీటితో నింపలేదని తెలిపారు. మరమ్మతులు పూర్తికాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట నుంచి కోటప్పకొండకు వచ్చే లింకు రోడ్లు మరమ్మతులు కూడా చేపట్టలేదని తెలిపారు. ఘాట్‌ రోడ్డు టోల్‌ గేట్‌ ద్వారా సంవత్సరానికి రూ.60 లక్షల ఆదాయం అటవీ శాఖకు వస్తున్నా మొక్కలకు నీళ్లు కూడా అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. కొండకు కిలోమీటరు దూరంలో బస్టాండ్‌ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే రోజుకొక గ్రూపుతో కొండకు వచ్చి రోడ్లు ఉడ్చి వెళ్లడం మినహా ఏర్పాట్లు జరుగుతున్న తీరును పట్టించుకోవడం లేదని విమర్శించారు.

I

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ తిరునాళ్ల జాతర మహోత్సవానికి అంతా సిద్ధమయింది. మహాశివరాత్రి రోజున నిర్వహించే తిరునాళ్లకు రెండు రోజుల ముందు ఏకాదశి నుంచే కోటప్పకొండలో భక్తుల రద్దీ ప్రారంభమవుతుంది. మూడు రోజుల్లో లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు తరలివచ్చి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కొండ దిగువున విద్యుత్‌ ప్రభల వెలుగులతో నిర్వహించే శివరాత్రి జాగరణతో ఉత్సవం ముగియనుంది. కోటప్పకొండ తిరునాళ్లకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి కోటయ్య స్వామికి మొక్కులు చెల్లించుకుని స్వామి వారి సన్నిధానంలో శివరాత్రి జాగరణ చేస్తారు.

విస్తృత ఏర్పాట్లు

ప్రత్యేక బస్సు సర్వీసులు

ఏర్పాట్లపై ఆరా తీస్తున్న

డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

పల్నాడు1
1/9

పల్నాడు

పల్నాడు2
2/9

పల్నాడు

పల్నాడు3
3/9

పల్నాడు

పల్నాడు4
4/9

పల్నాడు

పల్నాడు5
5/9

పల్నాడు

పల్నాడు6
6/9

పల్నాడు

పల్నాడు7
7/9

పల్నాడు

పల్నాడు8
8/9

పల్నాడు

పల్నాడు9
9/9

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement