వ్యవసాయ మార్కెట్ కమిటీలు
12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ..
జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో సెస్ వసూలులో రొంపిచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందంజలో ఉంది. రొంపిచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 1.67 కోట్లు కాగా జనవరి 31 నాటికి రూ.1,45,41,000 వసూలు చేసి 87.07 శాతానికి చేరుకొని జిల్లాలో మొదటి స్థానం సాధించింది.
దుర్గి వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 2.18 కోట్లు కాగా రూ. 1, 81,79,000 వసూలు చేసి 83.39 శాతానికి చేరుకొని జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
రాజుపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 1.45 కోట్లు కాగా రూ. 1,16, 76,000 వసూలు చేసి 80.52 శాతానికి చేరుకొని జిల్లాలో తృతీయ స్థానంలో నిలి చింది.
పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ. 2 కోట్లు కాగా రూ. 64.63 లక్షలు వసూలు చేసి 32.32 శాతంతో వెనుకబడి జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది.
జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 29 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇందులో దాచేపల్లి, గురజాల వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మిర్చి వంటి కొనుగోలు జరుగుతుంటాయి. మిగతా 10 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పలు రకాల ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతాయి.
ప్రధానంగా ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లు జరిగాయి. వీటి పరిధిలో ఎక్కువ మంది ట్రేడర్లు ముందు సెస్ చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. మరి కొంతమంది చిన్న స్థాయి వ్యాపారులు చెక్ పోస్టుల వద్ద చెల్లించి ఎగుమతులు చేస్తుంటారు. రైతుల శ్రేయస్సుకు సంబంధించి పలు రకాల కార్యక్రమాలు చేపడతారు. ఈ ఉత్పత్తుల ధరతో ఒక శాతం సెస్‌గా వసూలు చేయగా, వరి ధాన్యం పై 2 శాతం సెస్‌ను వసూలు చేస్తున్నారు.
మందకొడిగా మార్కెట్ కమిటీల పన్ను వసూలు
2025–26 ఏడాది లక్ష్యం రూ. 32.42 కోట్లు
జనవరి 31 నాటికి వసూలు రూ. 18.17 కోట్లు
లక్ష్యం చేరుకోవడానికి మార్చి చివరి వరకు గడువు
జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ యార్డులు
జిల్లాలో చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట, వినుకొండ, క్రోసూరు, మాచర్ల, రొంపిచర్ల, ఈపూరు, రాజుపాలెం, దుర్గి, గురజాలలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి. దాచేపల్లి, గురజాల వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మిర్చి మిగతా మార్కెట్ కమిటీల్లో ధాన్యం, ఇతర ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టింది.
పన్ను వసూలులో పల్టీలు
సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల సెస్ (పన్ను) వసూలు మందకొడిగా సాగుతుంది. జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలకు 2025– 26 సంబంధించి రూ. 32.42 కోట్లు వసూలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే జనవరి 31వ తేదీ నాటికి రూ. 18.17 కోట్లు వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించిన సెస్ వసూలుకు కేవలం రెండు నెలల గడువు ఉంది. ఒక్కో వ్యవసాయ మార్కెట్ కమిటీ రూ. కోటి పైనే వసూలు చేయడం సాధ్యమయ్యే పనేనా లేదా అనేది వేచి చూడాలి.
రొంపిచర్ల ముందంజ...
29 చెక్ పోస్టులు..
కి
వ్యవసాయ మార్కెట్ కమిటీలు


