అనేక వ్యూహాలు! | - | Sakshi
Sakshi News home page

అనేక వ్యూహాలు!

Feb 10 2026 7:20 AM | Updated on Feb 10 2026 7:20 AM

అనేక

అనేక వ్యూహాలు!

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు కేవలం కొన్ని గంటల సమయమే ఉంది. కౌంట్‌డౌన్‌ మొదలు కావడంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. నిజామాబాద్‌లో మేయర్‌ పీఠంపై కన్నేసిన కాంగ్రెస్‌, బీజేపీ కీలక నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తద్వారా మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో ఆయా డివిజన్ల వారీగా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించుకున్నారు. అందులో భాగంగా ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ తగినవిధంగా ప్లాన్లు అమలు చేస్తున్నారు. హోరాహోరీ పోరులో గెలుపు అవకాశాలు అటుఇటుగా ఉన్న డివిజన్ల విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అంచనా వేసుకుంటూ కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆర్మూర్‌లో కాంగ్రెస్‌, బీజేపీలు, బోధన్‌లో కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు, భీమ్‌గల్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఒక్క ఓటు విషయంలోనూ ఏమాత్రం తేడా రాకుండా ఉండేలా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

● ఇక అభ్యర్థులు సైతం తాము ఎలాగైనా గెలుపొందేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రచారం ముగిసిన తక్షణమే ఓటర్లకు సంబంధించి కులాలు, వర్గాల వారీగా ముందుగానే వేసుకున్న లెక్కల మేరకు డబ్బులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొందరు అభ్యర్థులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒక్కరోజులోనే అనేక వ్యూహాలు అమలు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయా వ్యూహాలకు పదును పెట్టారు.

● మరోవైపు ప్రత్యర్థులు ఒక్కో ఓటుకు ఎంతమేరకు డబ్బులు ఇస్తున్నారో తెలుసుకునేందుకు గాను సోమవారం రోజే పలువురు అభ్యర్థులు ట్రయల్‌గా కొందరు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. ఇది చూసి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఎంత డబ్బులు ఇస్తున్నారనే విషయాన్ని గమనిస్తున్నారు. ప్రత్యర్థి ఇచ్చేదానికంటే కొంత మొత్తం ఎక్కువ డబ్బు ఓటర్లకు ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక మద్యం బాటిళ్లు సైతం భారీగా ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ప్రత్యర్థి అమలు చేస్తున్న వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గాను కోవర్టులను ఏర్పాటు చేసుకోవడం విశేషం. ప్రతి నిముషం సద్వినియోగం చేసుకుంటూ అభ్యర్థులు వ్యూహాలు అమలు చేస్తుండడంతో పుర పోరు మరింత ఆసక్తికగా మారింది.

పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలు కాగా ఎత్తులు.. పైఎత్తులు

గెలుపు కోసం ప్రతి అవకాశాన్ని

సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు

దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు

రవాణా ఖర్చులు

డివిజన్‌, వార్డులను బట్టి

ఓట్ల కొనుగోలుకు మారుతున్న రేటు

ప్రత్యర్థి ఒక్కో ఓటుకు ఎంత ఇస్తున్నారో తెలుసుకునేందుకు ట్రయల్‌గా ఇప్పటికే డబ్బులు పంచిన పలువురు అభ్యర్థులు

మద్యం, డబ్బులు..

డివిజన్‌, వార్డులను బట్టి ఓటర్లకు ఏమేరకు డబ్బులు ఇవ్వాలనే విషయమై సైతం ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఒక్కో డివిజన్‌లో ఒక్కోవిధంగా ఓట్ల రేట్లు నిర్ణయించుకున్నారు. ఇక కులసంఘాలను గంపగుత్తగా కొనుగోలు చేసేందుకు అభ్యర్థులు ఆయా పా ర్టీల ద్వారా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. మ రోవైపు మహిళా సంఘాలతో ఓటర్లవారీగా లె క్కలు వేసుకుని డబ్బులు ఇచ్చే కార్యక్రమం నడిపిస్తున్నారు. ఇక డబ్బులు తీసుకోని ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట మాత్రం ఖరీదైన లిక్కర్‌ బాటిల్స్‌ ఇచ్చే కార్యక్రమాలు మూడు రోజులుగా నడుస్తూనే ఉన్నాయి. ఇక పలువురు ఓటర్లు ఇతర జిల్లాల్లో, హైదరాబాద్‌లో ఉంటే వారిని పోలింగ్‌ రోజువరకు తీసుకొచ్చేందుకు అన్నిరకాల రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు.

అనేక వ్యూహాలు!1
1/2

అనేక వ్యూహాలు!

అనేక వ్యూహాలు!2
2/2

అనేక వ్యూహాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement